Chiranjeevi : నాన్న నన్ను ఎందుకు పొగడరు అని బాధపడేవాడ్ని.. మా అమ్మను అడిగితే..

ఈ ఈవెంట్లో చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Chiranjeevi : నాన్న నన్ను ఎందుకు పొగడరు అని బాధపడేవాడ్ని.. మా అమ్మను అడిగితే..

Chiranjeevi Interesting Comments on his Father goes Viral

Updated On : October 29, 2024 / 8:02 AM IST

Chiranjeevi : నిన్న రాత్రి ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందించారు. ఈ ఈవెంట్ కు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Also Read : Chiranjeevi : అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు.. ఆయన సినిమా కోసం జట్కా బండిలో వెళ్తుంటే.. నాన్న కంగారు పడినా..

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నటుడిగా నేను ఎదుగుతున్నప్పుడు బయట ప్రేక్షకులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ నుంచి ప్రశంసలు వచ్చేవి. ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న నా సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. కానీ అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అని బాధగా ఉండేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్‌ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి అవి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అనుకున్నాను కానీ అనలేదు. దాంతో మా అమ్మ దగ్గరకు వెళ్లి.. ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఒక్క మాట కూడా అనరు, బాగుందని కూడా చెప్పరు. బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను. దానికి అమ్మ.. లేదురా నాన్న నిన్ను చాలా పొగుడుతారు. నా కొడుకు బాగా చేసాడు, అదరగొట్టేశాడు అని అంటారు అని చెప్పింది. మరి ఆ మాటలు నా దగ్గర అనొచ్చు కదా అని అమ్మను అడిగితే.. బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం అని చెప్పింది అంటూ తెలిపారు.