Chiranjeevi : అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు.. ఆయన సినిమా కోసం జట్కా బండిలో వెళ్తుంటే.. నాన్న కంగారు పడినా..

చిరంజీవి తల్లి అంజనమ్మ అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతటి అభిమానో చెప్పారు.

Chiranjeevi : అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు.. ఆయన సినిమా కోసం జట్కా బండిలో వెళ్తుంటే.. నాన్న కంగారు పడినా..

Megastar Chiranjeevi says how much his mother Anjana Devi is a fan of Akkineni Nageswara Rao

Updated On : October 29, 2024 / 7:47 AM IST

Chiranjeevi : ఏఎన్నార్ నేషనల్ అవార్డుని ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. నిన్న రాత్రి ఈ వేడుక ఘనంగా జరిగింది. అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందించారు. ఈ ఈవెంట్లో చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి తల్లి అంజనమ్మ అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతటి అభిమానో చెప్పారు.

Also Read : Chiranjeevi : నాగార్జున నాకు డాక్టర్.. అఖిల్ నన్ను పెదనాన్న అని పిలుస్తుంటే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

చిరంజీవి మాట్లాడుతూ.. ఈ వేడుకలో అమ్మని ముందు సీటులో కూర్చోబెట్టడానికి ముఖ్య కారణం అమ్మ నాగేశ్వరరావు గారికి సీనియర్ మోస్ట్ ఫ్యాన్. ఆమె నాగేశ్వరరావు గారికి ఎంత అభిమానో గతంలో ఓ సంఘటన చెప్పింది. నేను కడుపులో ఉన్నప్పుడు నాగేశ్వరావు గారి సినిమా విడుదలైతే ఆ సినిమా ఎలాగైనా చూడాలని నాన్న గారితో చెప్పింది. దాంతో నాన్న థియేటర్ కి వెళ్లడానికి ఒక జట్కా బండిని ఏర్పాటు చేశారు. జట్కా బండిలో వెళ్తుంటే కాస్త దారి తప్పి అది పక్కకు దొర్లింది. నాన్న చాలా కంగారు పడి ఇంటికి వెళ్లి పోదాం పద అని చెప్పారట. అయినా అమ్మ సినిమాకి వెళ్దామని పట్టుబట్టి ఆ రోజు సినిమా చూసి వచ్చింది. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు నేను పుట్టాను అని చెప్పింది. అమ్మకి నాగేశ్వరరావు గారి సినిమాలు అంటే అంత ఇష్టం అని అన్నారు.