Big Boss 5 Telugu: గ్లాస్‌హౌజ్‌లోకి సరిలేరు నీకేవ్వరు నటుడు!

తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. బిగ్ బాస్ కొత్త సీజన్ అనగానే ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని ముందు చర్చ జరగగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ అని కన్ఫర్మ్..

Big Boss 5 Telugu

Big Boss 5 Telugu: తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. బిగ్ బాస్ కొత్త సీజన్ అనగానే ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని ముందు చర్చ జరగగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ అని కన్ఫర్మ్ కావడంతో అందరి దృష్టి కంటెస్టెంట్ల మీద పడింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై చర్చలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే హౌస్ లోకి వెళ్లాల్సిన కంటెస్టెంట్లను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో క్వారంటైన్ కు తరలించగా వారిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే, స్టార్ మా మాత్రం సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రసారం కానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే ఈసారి గ్లాస్ హౌజ్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీరేనంటూ కొందరి పేర్లు షికార్లు చేస్తుండగా ఇప్పుడు వాటికి తోడుగా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

యాంకర్ రవి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, మహా న్యూస్ లహరి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, యాంకర్ కమ్ నటుడు లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సీరియల్ నటి నవ్య స్వామి, క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు ఇప్పటికే వినిపిస్తుండగా ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకేవ్వరు సినిమా నటుడు కుమనన్ సేతురామన్ కూడా హౌస్ లోకి వెళ్లడం గ్యారంటీ అని తెలుస్తుంది.

రమణ లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడతాది.. అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి రాసిన ఈ ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయారు 60 ఏళ్ల కుమనన్. ఈ సినిమా తర్వాత సైరా, వెంకీ, స్టాలిన్, అల్లుడు శీను, అరవింద్ 2 లాంటి చిత్రాలతో నటించారు. అయితే ఇప్పుడు ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయనున్నారట. ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.