నా కథకి మొదలు లేఖ – ‘తూటా’ ట్రైలర్

ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తూటా’ థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..

  • Publish Date - November 20, 2019 / 12:20 PM IST

ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తూటా’ థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..

ధనుష్, మేఘా ఆకాష్ జంటగా విలక్షణ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన  తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తూటా’.. ఈ సినిమా తెలుగులో ‘తూటా’ పేరతో విడుదలవుతోంది. విజయభేరివారి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం ‘తూటా’ థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది.

ధనుష్ తన ప్రేమని, ప్రేయసిని వర్ణిస్తుండగా స్టార్ట్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో భళ్లాలదేవ.. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రముఖ నటుడు, దర్శకుడు శశి కుమార్, ధనుష్ అన్నగా నటించాడు. సునైనా, సెంథిల్ వీరాస్వామి, వేల రామమూర్తి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Read Also : ఒకొక్కడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా – ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘తూటా’ నవంబర్ 29న తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. గౌతమ్ మీనన్ మార్క్ లవ్ స్టోరీ, ధనుష్, మేఘా ఆకాష్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాతలు చెప్పారు. మ్యూజిక్ : శివ, సినిమాటోగ్రఫీ : జాన్, మనోజ్ పరమహంస, కథీర్.