Unstoppable : కాంట్రవర్సీ ప్రశ్నలకి అదిరిపోయే సమాధానాలు ఇచ్చిన ముగ్గురు భామలు..

ముగ్గురు భామలని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగాడు బాలయ్య. వాటికి ముగ్గురు సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు అడిగి అబద్దమా, నిజమా అని చెప్పమన్నాడు బాలయ్య. మొదట ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస్తారు అని అడిగితే ముగ్గురు............

Three heroines gives answers to controversy questions in Unstoppable show

Unstoppable :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. ఇక ముగ్గురు భామలని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగాడు బాలయ్య. వాటికి ముగ్గురు సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు అడిగి అబద్దమా, నిజమా అని చెప్పమన్నాడు బాలయ్య. మొదట ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస్తారు అని అడిగితే ముగ్గురు ఔను అని చెప్పారు. హీరోలకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, హీరోయిన్స్ కి ఉన్నా దాని మీద డిపెండ్ అయి సినిమా తీయలేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది పెడుతున్నారు అని చెప్పారు.

Balakrishna : నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ ని పెట్టుకుంటాను..

హీరోయిన్స్ కరెక్షన్స్ చెప్తే డైరెక్టర్స్ నువ్వు ఏంటి చెప్పేది అని అంటారా, అలా ఫీల్ అవుతారా అనగా ముగ్గురు అబద్దం అనే చెప్పారు. హీరోయిన్ కి పెళ్లి అయితే మదర్ క్యారెక్టర్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోల్స్ చేయమని అడుగుతారు అనేదానికి జయప్రద అవును అని చెప్పగా జయసుధ, రాశిఖన్నా మాత్రం కాదు అని చెప్పారు. హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజెస్ తప్పవు అనేదానికి ముగ్గురు కాదు అనే చెప్పారు. ఇలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలకి ఈ ముగ్గురు కూడా సింపుల్ గా సమాధానాలు చెప్పేశారు.