Jakes Bejoy : ఒకేసారి మూడు భాషల్లో మూడు సినిమాలు.. సరిపోదా శనివారం మ్యూజిక్ డైరెక్టర్ హవా

తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్నారు టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్.

Three movies in three languages ​​at the same time Saripodhaa Sanivaaram music director Jakes Bejoy havaa

Jakes Bejoy : తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్నారు టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్. ఇప్పటికే తెలుగులో సరిపోదా శనివారం సినిమాతో ఆయన క్రేజ్ రెట్టింపైంది. జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సరిపోదా శనివారం సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అయ్యింది.

Also Read : Dil Raju : తెలుగులో కూడా యూట్యూబ్ చానెల్స్ కి షాక్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్

అయితే ఈ సినిమా హిట్ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ కి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందించిన 3 సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అది కూడా ఒకే భాషలో కాదు. మూడు సినిమాలు మూడు విభిన్న భాషల్లో విడుదలౌతున్నాయి. ఆ సినిమాల్లో తెలుగులో.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మెకానిక్ రాకీ, తమిళ్ లో నిరంగల్ మూండ్రు, అలాగే మలయాళంలో హలో మమ్మీ. ఇలా ఒకేసారి మూడు భాషల్లో, మూడు సినిమాలతో వస్తున్నాడు జేక్స్ బిజోయ్.

ఇక ఈ మూడు సినిమాలు కూడా రేపు (22 నవంబర్) రిలీజ్ కానున్నాయి. ఇలా ఒకేసారి మూడు భాషల్లో మూడు సినిమాతో వస్తుండడంతో చాలా థ్రిల్లింగ్ గా ఉందని ఓ పోస్ట్ కూడా షేర్ చేసారు జేక్స్ బిజోయ్. దీంతో ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.