Dil Raju : తెలుగులో కూడా యూట్యూబ్ చానెల్స్ కి షాక్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
తాజాగా సినిమా యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Producer Dil Raju shocking comments on YouTube channel movie reviews
Dil Raju : తాజాగా సినిమా యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ రివ్యూయర్స్ వల్ల సినిమాలు చాలా దెబ్బతింటున్నాయి. కేవలం తమిళ ఇండస్ట్రీనే కాదు తెలుగు ఇండస్ట్రీ సైతం ఈ సమస్యను ఎదుర్కుంటుంది. ఒక సినిమా విడుదలైన మొదటి షో నుండే చాలా మంది యూట్యూబ్ రివ్యూయర్స్ థియేటర్స్ ముందు మైక్ లు పట్టుకొని నిల్చుంటున్నారు. ఇక ఆ యూట్యూబ్ రివ్యూస్ వల్ల చాలా మంది జనాలు సినిమా చూడకుండా ఉండిపోతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి ఎనలేని నష్టం వాటిల్లుతుంది.
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తాజాగా ఆయన ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ డేట్ ఈవెంట్ నిర్వహించగా దిల్ రాజు ఈ ఈవెంట్ కి వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ.. తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం బాగుంది. కచ్చితంగా అది జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గురించి కేవలం ఒక్కరమే నిర్ణయం తీసుకోలేం. ఫిల్మ్ ఛాంబర్దీని గురించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ యూట్యూబ్ రివ్యూస్ లను ఆపెయ్యాలని చూస్తున్నారు అంటూ దిల్ రాజు తెలిపారు.
Also Read : Meghnathan : ఆ వ్యాధితో బాధపడుతూ.. కన్నుమూసిన ప్రముఖ నటుడు..
అయితే ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ ఈ నిర్ణయం తీసుకోగా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజానికి ఇలాంటి ఓ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే..యూట్యూబ్ రివ్యూస్ ఆపేస్తే ప్రతీ ఒక్క ప్రేక్షకుడు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తారు.