రీసెంట్‌గా తుంబా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ తుంబాకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది..
ఇండియాస్ బిగ్గెస్ట్ లైవ్ యాక్షన్ అడ్వంచర్ ఫిలింగా, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన మూవీ.. తుంబా.. హరీష్ రామ్ ఎల్.హెచ్. దర్శకుడు. రెగల్ రీల్స్, రోల్ టైమ్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన తుంబా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. పులిని ఫోటో తియ్యాలనుకునే ఒక అమ్మాయి, పెయింటింగ్ కాంట్రాక్ట్ కోసం టాప్ స్లీప్ కెళ్ళిన ఇద్దరు యువకులు, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు? అనే కథాంశంతో, ఉత్కంఠ భరితంగా తెరకెక్కింది.. రీసెంట్‌గా తుంబా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ తుంబాకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.
రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసింది మూవీ యూనిట్.. మే 17న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో తుంబా గ్రాండ్‌గా రిలీజవనుంది. సిపిమాలో వీఎఫ్ఎక్స్ హైలెట్ అవుతాయని దర్శకుడు చెప్తున్నాడు. ఈ సినిమాకి కెమెరా : నరేన్ ఎలాన్, మ్యూజిక్ : సంతోష్ దయానిధి, మాటలు : రామ్ రాఘవ్, ప్రభాకరన్ ఏ.ఆర్, ఎడిటింగ్ : కలైవానన్ ఆర్, ఆర్ట్ : సురేష్, ఫైట్స్ : యాక్షన్ 100.
వాచ్.. తుంబా ట్రైలర్..