ఇండియాస్ బిగ్గెస్ట్ లైవ్ యాక్షన్ అడ్వంచర్ ఫిలిం, తుంబా ట్రైలర్ రిలీజ్..
సాంకేతికంగా ఇండియన్ సినిమా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది.. వీఎఫ్ఎక్స్ ఎక్స్‌పెర్ట్స్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోవలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ లైవ్ యాక్షన్ అడ్వంచర్ ఫిలిం తుంబా తెరకెక్కింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకి హరీష్ రామ్ ఎల్ హెచ్ దర్శకుడు. రెగల్ రీల్స్, రోల్ టైమ్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా తుంబా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పులిని ఫోటో తియ్యాలనుకునే అమ్మాయి, పెయింటింగ్ కాంట్రాక్ట్ కోసం టాప్ స్లీప్‌కెళ్ళడం, అక్కడ వివిధ రకరకాల జంతువులతో విన్యాసాలు, సాహసాలు చెయ్యడం.. ఇలా సాగిపోతుంది తుంబా ట్రైలర్..
అడవి ప్రజలు దేవుడిగా కొలిచే పులి వల్ల హీరో, హీరోయిన్ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అడవిలో అసలేం జరిగింది.. అనే సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ కట్ చేసిన తుంబా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నరేన్ ఎలాన్ విజువల్స్, సంతోష్ దయానిధి ఆర్ఆర్ తో పాటు వీఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. మే నెలలో తుంబా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మాటలు : రామ్ రాఘవ్, ప్రభాకరన్ ఏఆర్, ఎడిటింగ్ : కలైవనన్ ఆర్, ఆర్ట్ : సురేష్, ఫైట్స్ : యాక్షన్ 100.
వాచ్.. తుంబా ట్రైలర్..