ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇంకోవైపు సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై పిటిషన్లు సైతం దాఖలు అయ్యాయి. కాగా.. లడ్డూ వివాదంపై సినీ నటుడు, జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు.
హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిదని అని అన్నారు. పవన్ వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నానని చెప్పారు. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలన్నారు. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ బాధ అని చెప్పారు.
అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్ అని అన్నారు. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోఘులెవరున్నా బయటకు వస్తారని, శిక్ష పడుతుందన్నారు. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అంటూ మండిపడ్డారు.