Game changer : రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్.. గ్రేస్‍ఫుల్ స్టెప్‍లతో అదరగొట్టిన చెర్రీ..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.

Raa Macha Macha song from Ram Charan Game changer movie
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కియారా అడ్వాణి హీరోయిన్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని కీలక పాత్రలను పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట రా మచ్చా.. మచ్చా అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా నకాష్ అజీజ్ పాటగా తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ పాటలో రామ్ చరణ్ ఎంతో గ్రేస్‌తో స్టెప్‌లను వేశాడు. మొత్తంగా పాట అదిరిపోయింది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది.
NTR – Devara : అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. ‘దేవర’ సక్సెస్ మీట్ అయినా పెడతారా?
ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన విశేషాల గురించి డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ప్రత్యేకంగా మాట్లాడారు. ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాటలో భాగమయ్యారని అన్నారు.