NTR – Devara : అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. ‘దేవర’ సక్సెస్ మీట్ అయినా పెడతారా?

సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే అమెరికాకు వెళ్లిపోయిన ఎన్టీఆర్ తాజాగా నేడు హైదరాబాద్ కి తిరిగొచ్చారు.

NTR – Devara : అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. ‘దేవర’ సక్సెస్ మీట్ అయినా పెడతారా?

NTR Return to Hyderabad from America after Devara Release fans Expecting Devara Success Meet

Updated On : September 30, 2024 / 12:43 PM IST

NTR – Devara : ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజయి థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు రోజుల్లో 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన దేవర 500 కోట్ల టార్గెట్ తో వెళ్తుంది. అయితే ఎన్టీఆర్ దేవర సినిమాకు తెలుగులో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదని తెలిసిందే. ఫ్యాన్స్ కోసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా అభిమానులు ఎక్కువగా వచ్చి వాళ్ళు చేసిన రచ్చతో అది కాస్తా క్యాన్సిల్ అయిపొయింది.

దీంతో ఎన్టీఆర్ దేవర కోసం తెలుగు మీడియా ముందుకు కానీ, తెలుగు ఫ్యాన్స్ ముందుకు కానీ వచ్చి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్పీచ్ వినాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలు సినిమా రిలీజ్ టైంలో కూడా ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ బియాండ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసారు. అయితే సినిమా ఫ్యాన్స్ కి తెగ నచ్చడంతో కూల్ అయ్యారు.

Also Read : Zebra Teaser : సత్యదేవ్ జీబ్రా టీజర్ రిలీజ్.. కామెడీతో పాటు థ్రిల్లింగ్ కూడా..

సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే అమెరికాకు వెళ్లిపోయిన ఎన్టీఆర్ తాజాగా నేడు హైదరాబాద్ కి తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్, భార్య ప్రణతి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ తిరిగొచ్చారు కాబట్టి కనీసం సక్సెస్ మీట్ అయినా గ్రాండ్ గా పెట్టండి అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అవ్వకూడదు అని దేవర సక్సెస్ మీట్ ఏపీలో ఓపెన్ గ్రౌండ్ లో పెడతారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. సక్సెస్ మీట్ పెట్టాలని, ఎన్టీఆర్ స్పీచ్ వినాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి సక్సెస్ మీట్ ఎప్పుడు పెడతారో చూడాలి.