Tirupati Prakash : కళ్యాణ్ బాబు, నేను స్కూటర్ మీద తిరిగేవాళ్ళం.. చలిలో వణుకుతున్న పిల్లల్ని చూసి జేబులో మొత్తం డబ్బులు ఇచ్చేసి..

తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ కెరీర్ మొదట్లో చేసిన చాలా సినిమాల్లోనూ ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఏర్పడింది.

Tirupathi Prakash Interesting Comments on Pawan Kalyan Helping

Tirupati Prakash : పవన్ కళ్యాణ్ హీరోగా, రాజకీయ నాయకుడిగానే కాక ఒక మంచి మనిషిగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందికి దానాలు చేసి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసి పవన్ తన మంచితనాన్ని చాటుతున్నాడు. తాజాగా ఒకప్పటి కమెడియన్ తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.

ఎన్నో సినిమాల్లో తన కామెడీతో మెప్పించిన తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ కెరీర్ మొదట్లో చేసిన చాలా సినిమాల్లోనూ ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఏర్పడింది. సుస్వాగతం సినిమాకు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి సంగతులను తిరుపతి ప్రకాష్ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read : Sobhita Dhulipala : చైతూలో నాకు నచ్చే అంశాలు అవే.. ఇన్నాళ్లు ఎలాంటి ప్రేమ కోసం అయితే ఎదురుచూశానో..

తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, నేను హైదరాబాద్ రోడ్ల మీద స్కూటర్ మీద తిరిగాం. మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను. స్కూటర్ వేసుకొని వెళ్ళేవాడిని. అదే స్కూటర్ మీద ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. పంజాగుట్టలో ఓ చైనీస్ రెస్టారెంట్ లో రాత్రి పూట తినేవాళ్ళం. పెట్రోల్ కళ్యాణ్ కొట్టించేవాడు. అప్పట్లోనే అందరికి బాగా హెల్ప్ చేసేవాడు. ఓ సారి అలాగే రాత్రి పూట తిరుగుతూ నంది హిల్స్ లో బిల్డింగ్ పనులు జరుగుతుంటే అక్కడికి వెళ్లి కూర్చున్నాం. అక్కడ ఓ గుడిసెలో పనిచేసే వాళ్ళ పిల్లలు చలికి వణుకుతూ పడుకున్నారు. అది చూసి నాతో మనకి డబ్బుంది కాబట్టి ఇలా బతుకుతున్నాం. వాళ్ళు చూడు అని చూపించారు. వాళ్ళ అమ్మని పిలిచి జేబులో డబ్బులు అన్ని ఇచ్చి పిల్లలకు స్వెట్టర్, కానీ దుప్పట్లు కానీ కొనివ్వమన్నాడు. చాలా సింప్లిసిటీ మనిషి. సుస్వాగతం సమయంలో ఇది జరిగింది అని తెలిపాడు.

అలాగే.. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తే ఓ రూమ్ లో కొన్ని వందల పుస్తకాలు ఉండేవి. ఇంకో రూమ్ లో మొత్తం మార్షల్ ఆర్ట్స్ సామాన్లు ఉండేవి అని తెలిపాడు. దీంతో ప్రకాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు.