Sobhita Dhulipala : చైతూలో నాకు నచ్చే అంశాలు అవే.. ఇన్నాళ్లు ఎలాంటి ప్రేమ కోసం అయితే ఎదురుచూశానో..

పెళ్లి తర్వాత శోభిత తాజాగా ఓ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతన్యలో తనకు నచ్చే అంశాలు ఏంటి అని తెలిపింది.

Sobhita Dhulipala : చైతూలో నాకు నచ్చే అంశాలు అవే.. ఇన్నాళ్లు ఎలాంటి ప్రేమ కోసం అయితే ఎదురుచూశానో..

Sobhita Dhulipala speak about Naga Chaitanya Best Qualities after Marriage

Updated On : December 8, 2024 / 2:34 PM IST

Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ గత కొన్నేళ్లు హీరో నాగ చైతన్యతో సీక్రెట్ ప్రేమాయణం గడిపి ఇటీవల డిసెంబర్ 4న ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇద్దరూ తమ సినిమాలతో, సిరీస్ లతో బిజీగా ఉంటూనే డేటింగ్ చేస్తూ ఒకర్నొకరు అర్ధం చేసుకొని రెండు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకొని ఇటీవలే కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత శోభిత తాజాగా ఓ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతన్యలో తనకు నచ్చే అంశాలు ఏంటి అని తెలిపింది.

Also Read : Pushpa 2 : హిందీలో అల్లు అర్జున్ రేర్ రికార్డు.. మూడు రోజుల్లో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఎంతంటే..

శోభిత మాట్లాడుతూ.. చై సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయగా ఉండటం నన్ను ఫస్ట్ ఆకట్టుకున్నాయి. చై అందరితో చాలా మర్యాదగా ఉంటాడు. అందరితో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్ గా ఉంటాడు. అతనిలో నాకు నచ్చే అంశాలు అవే. చాలా కేరింగ్ పర్సన్ కూడా. నన్ను బాగా ప్రేమిస్తాడు. ఎలాంటి ప్రేమ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసానో అది చైతూ దగ్గర్నుంచి దొరికింది. అలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం అని తెలిపింది. దీంతో శోభిత కామెంట్స్ వైరల్ గా మారాయి.