Pushpa 2 : హిందీలో అల్లు అర్జున్ రేర్ రికార్డు.. మూడు రోజుల్లో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఎంతంటే..

ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2.

Pushpa 2 : హిందీలో అల్లు అర్జున్ రేర్ రికార్డు.. మూడు రోజుల్లో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఎంతంటే..

Pushpa 2 Hindi Collections in three days

Updated On : December 8, 2024 / 2:28 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రికార్డ్స్ బ్రేకింగ్ వసూళ్లను రాబడుతుంది.

Also Read : Sukumar : పుష్ప 2ని అతను కూడా డైరెక్ట్ చేసాడంట.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2. హిందీలో మొదటి రోజు 72 కోట్ల నెట్ వసూళ్లు చేసిన ఈ సినిమా రెండవ రోజు 59 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన షారుఖ్ జవాన్ సినిమా 69 కోట్లను బ్రేక్ చేసింది. అయితే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే అనుకోవచ్చు. కానీ మూడో రోజు కూడా అత్యధిక కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది.

పుష్ప 2 సినిమా మూడవ రోజు హిందీలో ఏకంగా 74 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా హిందీలో మూడో రోజు అన్ని కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో పుష్ప 2 బాలీవుడ్ లో కూడా అసరికొత్త రికార్డ్ సెట్ చేసింది. పుష్ప 2 కేవలం హిందీలోనే మొత్తం మూడు రోజులు కలిపి 205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు మేకర్స్.


కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయిలో రికార్డు బ్రేక్ చేసిందంటే రానున్న రోజుల్లో పుష్ప హిందీ వెర్షన్ ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విదులైంది. విడుదలైన మొదటి రోజు ఓవర్ ఆల్ గా 294 కోట్ల గ్రాస్ అందుకోగా.. విడుదలైన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు 500 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది.