Sukumar : పుష్ప 2ని అతను కూడా డైరెక్ట్ చేసాడంట.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సుకుమార్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఆయనతో పాటు ఇంకెంతమంది కష్టపడ్డారో, అలాగే తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ గురించి తెలిపాడు.

Sukumar : పుష్ప 2ని అతను కూడా డైరెక్ట్ చేసాడంట.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sukumar interesting comments on his Assistant Director Sriman

Updated On : December 8, 2024 / 12:40 PM IST

Sukumar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం 2 రోజుల్లోనే 500 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుండి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

Also Read : Pawan Kalyan : వారికోసం 10వ తరగతి పిల్లల సైన్స్ ఎక్సపరిమెంట్.. వారిని అభినందిస్తూ పవన్ పోస్ట్..

అయితే పుష్ప 2 మెగా బ్లాక్ బస్టర్ సాధించడంతో నిన్న సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ మీట్ కి డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు మూవీ టీమ్ అంతా వచ్చారు. ఇక ఇందులో భాగంగానే సుకుమార్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఆయనతో పాటు ఇంకెంతమంది కష్టపడ్డారో, అలాగే తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ గురించి తెలిపాడు. శ్రీమాన్ కి ఆయనకి మధ్య ఉన్న అనుభందం గురించి తెలిపారు.

సుక్కు మాట్లాడుతూ..” శ్రీమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు పుష్ప 2 సినిమాను సగం డైరెక్ట్ చేసింది అతనే. తనని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతను కల్మషం లేని వ్యక్తి. పుష్ప 2 లోని చైల్డ్ ఎపిసోడ్ డైరెక్ట్ చేసింది ఇతనే. అదే కాదు సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ కూడా చేసాడు. పుష్ప 2 మూవీలోని 40 శాతం సన్నివేశాలకు శ్రీమానే దర్శకుడు. పొరపాటున డైరెక్టర్ గా నా పేరు పెట్టుకున్న. నిజానికి డైరెక్టెడ్ బై ‘శ్రీమాన్, సుకుమార్’ అని వేయాలని” చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.