Tirupati Prakash Shares Interesting Things about Master Movie and Chiranjeevi
Tirupati Prakash : ఒకప్పటి కమెడియన్ తిరుపతి ప్రకాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అప్పటి సినిమాల గురించి చాలా సంగతులు పంచుకున్నాడు. తిరుపతి ప్రకాష్ చిరంజీవితో కూడా చాలా సినిమాల్లో కలిసి నటించాడు. మాస్టర్ సినిమాలో వీళ్ళ కాంబినేషన్ సీన్స్ చాలా ఉంటాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాస్టర్ సినిమా సమయంలో జరిగిన సంఘటనలను పంచుకున్నారు.
తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ.. మాస్టర్ సినిమా అప్పుడు నన్ను, వేణుమాధవ్, బండ్ల గణేష్, శివాజీ, ఉత్తేజ్, శ్రీకాంత్.. ఇలా ఇంకొంతమందిని ఇంటికి పిలిచి ఆయనే స్వయంగా దోశలు వేసి తినండి అని పెట్టారు. పచ్చడి కావాలా అని అడిగి మరీ వేసేవాళ్ళు. చరణ్ అప్పుడు చిన్నోడు. ఓ 14 ఏళ్ళు ఉంటాయి. మాతో చాలా క్లోజ్ గా, సరదాగా ఉండేవారు అని తెలిపాడు.
అలాగే.. ఫస్ట్ టైం టాలీవుడ్ లో కారవాన్ వాడింది చిరంజీవినే. మాస్టర్ సినిమా చిరంజీవి కోసం మొదటిసారి ముంబై నుంచి కారవాన్ వచ్చింది. అప్పట్లో అది చూసి ఆశ్చర్యపోయాం. కారవాన్ ఉన్నా బ్రేక్ టైంలో బయటకి వచ్చి అందరితో కలిసి ఉండేవాళ్ళు. ఆయన కారవాన్ లోనే ఓ సారి మా అందర్నీ ఎక్కించుకొని శ్రీశైలం తీసుకెళ్లారు అని తెలిపాడు.