Tirupur Subramaniam famous distributor in Tamilanadu sensational comments on Movies Collections
Tirupur Subramaniam : ఇటీవల మన హీరోలు కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతున్నారని లెక్కలు చెప్తూనే ఉన్నారు. ఒకప్పుడు 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టాలంటే కిందా మీద పడేవారు. కానీ ఇప్పుడు మొదటిరోజే 100 కోట్ల కలెక్షన్స్(Collections) వచ్చేస్తున్నాయి. అయితే కొంతమంది తప్పుడు కలెక్షన్స్ చెప్తున్నారని, సినిమాని మరింత ప్రమోట్ చేయడానికి, అభిమానుల కోసం ఇలాంటి లెక్కలు చెప్తున్నారని గతంలోనే పలువురు వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్(Distributor) దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం తాజాగా సినిమా కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ప్రస్తుతం CII దక్షిణ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సౌత్ నుంచి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వచ్చారు. అనేక అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చలు జరిగాయి. తాజాగా గురువారం నాడు తమిళనాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Puri Jagannadh : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేదా పైసా వసూల్ సీక్వెల్.. పూరి నెక్స్ట్ ఏంటి??
CII దక్షిణ సమ్మిట్ లో తిరుపూర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చిత్ర నిర్మాతలు దయచేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి నిజాలు చెప్పండి. ఇటీవల బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్నీ అబద్ధాలే. ఇలాంటి అబద్దాలు చెప్తున్నందుకు సిగ్గుపడండి. సినిమా ఫ్లాప్ అయితే నిజం చెప్పి హీరోలకు బుద్ధి వచ్చేలా చేయండి. హీరోల గొప్ప కోసం, అభిమానుల కోసం అబద్దపు లెక్కలు చెపొద్దు. మేము అసలు లెక్కలు చెప్తే నిర్మాతలకు, నటీనటులకు కోపం వస్తుంది. నిర్మాతలు సినిమా కలెక్షన్స్ గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే సినీ పరిశ్రమ బాగుపడుతుంది. ఫ్లాప్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్లు పెట్టి డబ్బులు వేస్ట్ చేసే బదులు ఆ డబ్బుని మంచి సినిమాలకు ఖర్చు పెట్టండి. మనం సినిమాలతో ప్రేక్షకులని సంతృప్తిపరచాలి, హీరోలను కాదు. మీరు గొప్పలు చెప్పుకొని కలెక్షన్స్ వచ్చాయన్న సినిమాలకు మాకు మాత్రం నష్టాలే మిగిలాయి అని అన్నారు. దీంతో తిరుపూర్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరన్నా నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి.