Sree Vishnu: టాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసెుకుపోతున్న హీరో శ్రీవిష్ణు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Sree Vishnu: మరో సినిమాను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు.. తగ్గేదే లే అంటున్నాడుగా!
శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లుగా వెల్లడించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను ఫిబ్రవరి 14న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పర్ఫార్మెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. ముఖ్యంగా యూత్ ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాను ‘వివాహ భోజనంబు’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా, ‘విజిల్’ ఫేం రెబా మోనికా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా.. ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.
Get Ready to take a Peep at the World of Laughs & Thrills ???
TITLE & First Look of @sreevishnuoffl’s next,
Tomorrow at 11.07 AM ⏰@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @_balajigutta @BhanuBogavarapu @GopiSundarOffl @AKentsOfficial @HasyaMovies @ChotaKPrasad pic.twitter.com/ezrvZWrtij— Ram Abbaraju (@RamAbbaraju) February 13, 2023