Sree Vishnu: మరో సినిమాను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు.. తగ్గేదే లే అంటున్నాడుగా!

యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా ‘అల్లూరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్‌తో శ్రీవిష్ణు ఫుల్ జోష్‌తో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

Sree Vishnu: మరో సినిమాను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు.. తగ్గేదే లే అంటున్నాడుగా!

Sree Vishnu Launches His New Movie

Sree Vishnu: యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా ‘అల్లూరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్‌తో శ్రీవిష్ణు ఫుల్ జోష్‌తో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

Sree Vishnu : ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది.. అదరగొట్టిన శ్రీ విష్ణు స్పీచ్.. బండ్లన్నని గుర్తు చేశాడుగా..

అయితే అల్లూరి సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా, శ్రీవిష్ణు తాజాగా తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ‘వివాహ భోజనంబు’ మూవీ ఫేం దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో శ్రీవిష్ణు తన నెక్ట్స్ సినిమాను చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సినిమా టాప్ ప్రొడ్యూస్ అనిల్ సుంకర్ ప్రెజెంట్ చేస్తుండగా, ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Sree Vishnu: శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి తరవాతి స్థానం ‘నాని’దే!

ఈ సినిమాలో శ్రీవిష్ణు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ వీఐ ఆనంద్, నటుడు నారా రోహిత్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కు నారా రోహిత్ క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.