Shyam Singha Roy
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకోగా కమర్షియల్‌గా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
Shyam Singha Roy : డిలీటెడ్ సీన్ చూశారా?..
ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ సినిమా దక్షణాది అన్ని రాష్ట్రాలలో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా విడుదలైంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే బాలీవుడ్ హీరోల నుండి మేకర్స్ వరకు ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలైనట్లుగా కథనాలొచ్చాయి. కాగా.. ఇప్పుడు శ్యామ్ రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీకి దిగినట్లుగా తెలుస్తుంది.
Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ
క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తూ తెలుగు సినిమాని దగ్గరగా చూసిన అజయ్ దేవగన్ శ్యామ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉండగా.. నానీ జెర్సీ సినిమాను ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ చేసి విడుదలకి సిద్ధం చేసిన షాహిద్ కపూర్ కూడా శ్యామ్ సింగరాయ్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడట. ఈ ఇద్దరూ ఒకే బాలీవుడ్ దర్శకుడితోనే ఈ సినిమా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. ఎవరి ప్రయత్నం ఫలించి అక్కడ ఈ సినిమాను తెర మీదకి తీసుకెళ్తారో చూడాలి.