Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే.. బాలయ్యతో యానిమల్.. గుంటూరు కారం మూవీకి పవర్ స్టార్ వాయిస్!

ప్రస్తుతం ఫోర్‌-కే రీ-రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన "ముత్తు" మూవీ వచ్చేనెల 2న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది.

Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే.. బాలయ్యతో యానిమల్.. గుంటూరు కారం మూవీకి పవర్ స్టార్ వాయిస్!

భగవంత్‌ కేసరి నుంచి కీలక అప్డేట్
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్‌ కేసరి” మూవీకి సంబంధించి మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. ప్రేక్షకుల మనసును హత్తుకున్న “ఉయ్యాలో ఉయ్యాలా” ఫుల్‌ సాంగ్‌ వీడియోను మూవీ టీమ్‌ విడుదల చేసింది. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో ఈ మూవీ సూపర్‌ హిట్‌ అయింది.

యానిమల్ తో బాలయ్య అన్‌స్టాపబుల్‌.. ప్రొమో రిలీజ్
అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే ఎపిసోడ్‌ ప్రోమో రిలీజైంది. నందమూరి బాలకృష్ణ “అన్ స్టాపబుల్” టాక్ షోలో “యానిమల్” టీమ్ ఓ రేంజ్‌లో సందడి చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమోలో అదిరిపోయే డ్యాన్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, “యానిమల్” టీమ్‌తో బాలయ్య రచ్చ… ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ షోలో పాల్గొన్నారు.

క్రేజీ ప్రమోషన్స్‌పై యానిమల్‌ టీమ్‌ దృష్టి
యానిమల్‌ టీమ్‌ క్రేజీ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. వచ్చేనెల 1న రిలీజ్‌ కానున్న ఈ మూవీ కోసం యానిమల్‌ టీమ్‌ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. నిన్న టైమ్స్‌ స్క్వేర్‌లో, ఇవాళ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో ఈ మూవీ ట్రైలర్‌ను స్క్రీనింగ్‌ చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కాబోతుంది.

కాంతారా 2 లేటెస్ అప్డేట్
ఈనెల 27న “కాంతారా 2” మూవీ పూజా కార్యక్రమం జరగనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. కాంతారా మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. హోంబేలె ఫిలిమ్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఓ ముఖ్యపాత్రలో నటించనున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్
న్యూ ఇయర్‌ వెకేషన్స్‌ కోసం త్వరలో విదేశాలకు వెళ్లబోతున్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. డిసెంబర్‌లో గుంటూరు కారం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ఆయన ఫారెన్‌ టూర్‌ వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాకే.. సినిమా ప్రమోషన్లు స్టార్‌ చేస్తారని టాక్‌ వినిపిస్తుంది.

గుంటూరు కారం మూవీకి పవర్ స్టార్ వాయిస్!
“గుంటూరు కారం” మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ వాయిస్ అందించనున్నారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మహేష్ బాబు ఎంట్రీ సీన్‌తో పాటు పలు కీలక సీన్స్‌కు పవర్ స్టార్ వాయిస్ ఓవర్ అందించనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్‌ వాయిస్‌తో గుంటూరు కారం సినిమా అదిరిపోనుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే దీని‌పై గుంటూరు కారం మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సలార్ మూవీపై ఆసక్తికర చర్చ
సలార్ మూవీ రన్ టైమ్‌పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ మూవీ బిగ్‌ టైమ్‌ లైన్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉండనున్నట్లు టాక్. ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే అత్యధిక రన్ టైం‌తో వచ్చే సినిమాగా సలార్ నిలవనుంది. అటూ డిసెంబర్ 1 ట్రైలర్‌ విడుదలకు టైమ్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.

గోవాలో గోపీచంద్ మూవీ కీలక సన్నివేశాలు
గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూవీకి సంబంధించి గోవాలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు.. ఇటీవలే ఇటలీలో ప్రధాన సన్నివేశాలతో పాటు, పాటల్ని చిత్రీకరించారు. ఇది గోపీచంద్‌కు 32వ చిత్రం. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాకి గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లే రాశారు.

38లోకి ముద్దు గుమ్మ నయనతార
హాట్‌ బ్యూటీ నయనతార బర్త్‌డే సందర్భంగా “టెస్ట్‌” మూవీ టీమ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 1984 నవంబర్ 18న ముంబైలో పుట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ.. నేటితో 38 ఏళ్లు పూర్తిచేసుకుని 39వ వసంతంలోకి అడుగుపెట్టింది. నయన్‌ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు విషెస్‌ తెలిపారు. ఈ పోస్టర్‌లో న‌య‌న‌తార ట్రేడిషన‌ల్ లుక్‌తో ఆక‌ట్టుకుంటుంది.

రజనీకాంత్ ‘ముత్తు’ మూవీ డిసెంబర్ 2న రీ-రిలీజ్
ప్రస్తుతం ఫోర్‌-కే రీ-రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన “ముత్తు” మూవీ వచ్చేనెల 2న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లో బ్రహ్మాండంగా ముత్తు విడుదలకు సిద్ధం అయింది. తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు మొదటి వరుసలో ఉంటుంది.

ఆదికేశవ ట్రైలర్ వాయిదా
“ఆదికేశవ” మూవీ ట్రైలర్‌ వాయిదా పడింది. నిన్న విడుదల కావాల్సిన ట్రైలర్‌ సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు, త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు మూవీ మేకర్స్‌ చెప్పారు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌పై తెరకెక్కిస్తున్నారు.

హిట్ టాక్ తో మంగళవారం మూవీ టీం చిట్ చాట్
“మంగళవారం” మూవీ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో.. మూవీ టీమ్‌ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని అజయ్‌ భూపతి తెరకెక్కించారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ‘భైరవ కోన’
యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది “భైరవ కోన”లోని సాంగ్‌. ఈ పాట ఇప్పటికే ఎనిమిదన్నర కోట్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. సందీప్‌ కిషన్‌, వర్ష కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుఉ రాబోతుంది.

శామ్‌ బహదూర్ నుంచి విక్కీ కౌశల్‌ లుక్‌ టెస్ట్‌ వీడియో రిలీజ్‌
వచ్చేనెల ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది “శామ్‌ బహదూర్‌”. ఈ మూవీ నుంచి తాజాగా విక్కీ కౌశల్‌ లుక్‌ టెస్ట్‌ వీడియో రిలీజ్‌ చేశారు. శామ్‌ మానెక్‌ షా లైఫ్‌ స్టోరీ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ మూవీని డైరెక్టర్‌ మేఘనా గుల్జార్‌ తెరకెక్కించారు.

సౌండ్‌ పార్టీ వచ్చేస్తోంది
ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కాబోతుంది “సౌండ్‌ పార్టీ”. వీజే సన్ని, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై..రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ ఈ సినిమాను నిర్మించారు.

డిసెంబర్‌ 7న “హాయ్‌ నాన్న”
ఎన్నికల సీజన్‌ సందర్భంగా న్యాచురల్‌ స్టార్‌ నాని ఓ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశారు. వచ్చేనెల 7న మీ ప్రేమ, మీ ఓటు మాకే వేయాలని సరికొత్తగా ప్రేక్షకులను కోరారు నాని. డిసెంబర్‌ 7న నాని నటించిన “హాయ్‌ నాన్న” మూవీ రిలీజ్‌ కాబోతుంది. ఇందులో భాగంగానే నాని చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌ నటిస్తున్న ఈమూవీని డైరెక్టర్‌ శౌర్యువ్‌ తెరకెక్కిస్తున్నారు.

అనుభవాలను పంచుకున్న కోట బొమ్మాళి
వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. తాను ఏ పాత్ర చేసినా అది తెరపై ప్రభావవంతంగా కనిపించాలని.. అది ప్రేక్షకులకు చేరువవ్వాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. “కోట బొమ్మాళి పీఎస్‌” మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తన అనుభవాలను పంచుకుంది.

సైరెన్ తెలుగు టీజర్‌ రిలీజ్
జయం రవి, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సైరెన్‌’. 108.. ట్యాగ్‌లైన్‌. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా తెలుగు టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసే హీరో క్రిమినల్‌గా మారినట్లు టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

ది విలేజ్‌ ట్రైలర్‌ విడుదల
తమిళ హీరో ఆర్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ “ది విలేజ్‌” ట్రైలర్‌ విడుదలైంది. ఈ సిరీస్‌కు మిలింద్ రాజు దర్శకత్వం వహించారు. ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఈ నెల 24 నుంచి “అమెజాన్‌ ప్రైమ్‌”లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

సుమంత్ సినిమా టైటిల్ ఫిక్స్
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి “మహేంద్రగిరి వారాహి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాని జాగర్లమూడి సంతోష్ తెరకెక్కిస్తున్నారు. మీనాక్షీ గోసామి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించినట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది.