Suhas : తండ్రి అయిన టాలీవుడ్ నటుడు.. పండంటి మగబిడ్డకు జన్మించిన సుహాస్ భార్య..

తండ్రి అయిన టాలీవుడ్ నటుడు సుహాస్. తన భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనించినట్లు సుహాస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Tollywood actor suhas had baby boy instagram post viral

Suhas : టాలీవుడ్ నటుడు సుహాస్.. కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆరిస్టుగా, విలన్‌గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ నటుడు హీరోగా చేస్తున్న సినిమాలు అరడజనకు పైగా ఉన్నాయి. ఇక ఈ ప్రొఫిషనల్ లైఫ్‌లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా సుహాస్ హ్యాపీ మూమెంట్స్ ని చూస్తున్నారు. సుహాస్ ఇప్పుడు తండ్రిగా ప్రమోషన్ తీసుకున్నారు.

సుహాస్ భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనించినట్లు సుహాస్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బాబుతో ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసిన సుహాస్.. ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ ఫోటో చూసిన ఆడియన్స్ సుహాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సుహాస్‌ది ప్రేమ వివాహం. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని, లైఫ్ లో సెటిల్ అయ్యాక 2017లో లలితని పెళ్లి చేసుకున్నారు.

Also read : HanuMan : రామ మందిరం ప్రారంభోత్సవం నాడు.. హనుమాన్ మూవీ సంచలనం..

ఇక సుహాస్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం, ఆనందరావు అడ్వాంచర్స్, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉంది. వీటిలో ముందుగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ అండ్ ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.

రెండు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ చూసిన దాన్నిబట్టి.. ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామాతో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ కథలో ఆడపిల్లల పుడితే భారం అనుకునే అంశాన్ని, అలాగే జాతిభేదం అంశాలను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. దుశ్యంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. శివాని హీరోయిన్ గా నటిస్తుండగా, ఫిదా ఫేమ్ శరణ్య ఒక ప్రధాన పాత్ర చేస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.