Tollywood Actress shares her childhood photo with her brother
Tollywood Actress : వెండితెరపై తమ అందాలతో అందరి మనసులు దోచుకునే ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువైన తరువాత అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ ప్లాట్ ఫార్మ్‌లతో తమ పర్సనల్ లైఫ్ ని కూడా ఆడియన్స్ కి తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తమ లైఫ్ లో జరిగే ప్రతి సెలబ్రేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ని షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు తమ ఓల్డ్ ఫొటోస్, చైల్డ్‌హుడ్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా ఓ తెలుగు యాక్ట్రెస్ తన బ్రదర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ చిన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫోటోలు మూడు, నాలుగేళ్ళ వయసులోని పిక్స్ లాగా కనిపిస్తున్నాయి. ఆ ఫొటోల్లో ఆ యాక్ట్రెస్, తన బ్రదర్ పల్లెటూరి అమ్మాయి, అబ్బాయి గెటప్స్ లో కనిపిస్తున్నారు. మరి ఈ కనిపిస్తున్న చిన్నప్పటి ఫొటోలోని యాక్ట్రెస్ ఎవరో గుర్తుపట్టారా..?
Also read : Sankranti Movies : సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియా వారిని హెచ్చరిస్తూ.. ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన..
ఆమె ఎవరో కాదు, తెలుగు వెండితెరపై నటిగా, బుల్లితెరపై యాంకర్ గా టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా తెలిసిన శ్రీముఖి. ఈరోజు జనవరి 9న ఆమె బ్రదర్ ‘సుశ్రుత్’ పుట్టినరోజు కావడంతో.. తమ్ముడితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విష్ చేశారు. ఈక్రమంలోనే చిన్నప్పటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఇక ఆ పోస్టుకి ఇలా రాసుకొచ్చారు.. “నా సంతోషం, నా ధైర్యం, ప్రతి సందర్భంలో నాకు తోడుగా ఉన్న నా స్వీట్ చిట్టి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నారు.
అలాగే శ్రీముఖి అమ్మ లతశ్రీ కూడా తన కొడుకుని విష్ చేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు. లతశ్రీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. రీల్స్, ఫొటోలతో నెట్టింట సందడి చేస్తుంటారు. ఇటీవల శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఒక టీవీ షోకి గెస్ట్ గా వచ్చి అందరికి పరిచయం అయ్యారు. మరి శ్రీముఖి అమ్మ లతశ్రీ ఇన్‌స్టాగ్రామ్ వైపు కూడా ఓ లుక్ వేసేయండి.