Sankranti Movies : సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియా వారిని హెచ్చరిస్తూ.. ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన..
సంక్రాంతి సినిమాల వివాదం పై ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరిక లేఖ. ప్రతి జర్నలిస్ట్, మీడియా అసోసియేషన్ యాజమాన్యాలకు లేఖ పంపి..

Telugu Film chamber releases press note about Sankranti Movies conflict issue
Sankranti Movies : ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో సినిమాల మధ్య వార్ కంటే.. నిర్మాతలు, విలేకర్లు మధ్య వార్ ఎక్కువుగా కనిపిస్తుంది. ఈసారి మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున సినిమాలతో పాటు చిన్న హీరో తేజ సజ్జ సినిమా కూడా ఉండడం, ఆ చిత్రానికి థియేటర్స్ కేటాయింపు దగ్గర అన్యాయం జరిగిందంటూ వివాదం మొదలయింది. ఈక్రమంలోనే దిల్ రాజు పేరు తీసుకువస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వివాదం గురించి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “దిల్ రాజుకి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. ఆయనకు ఏ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు” అని కామెంట్స్ చేస్తూ గతంలో జరిగిన ఓ విషయాన్ని అందరికి తెలియజేశారు. అయితే కొన్ని వెబ్ సైట్స్ చిరు చెప్పిన మాటల్ని పూర్తిగా రాయకుండా, అక్కడ కూడా దిల్ రాజుని కార్నర్ చేస్తూ ఆర్టికల్స్ రాశారు.
Also read : Dil Raju : తప్పు వార్తలు రాస్తే.. వెబ్ సైట్ల తాటతీస్తా.. చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు..
అలాగే తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం లేదంటే, దిల్ రాజు ఓ తమిళ సినిమాని రిలీజ్ చేయడానికి థియేటర్స్ బ్లాక్ చేసుకున్నారని కూడా ఆర్టికల్స్ రాశారు. ఇక ఆర్టికల్స్ అన్నిటి పై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిన్న ఓ మూవీ ఫంక్షన్ లో ‘తాట తీస్తాను’ మీడియా వాళ్ళ పై ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. మీడియా వారికీ ఓ హెచ్చరిక జారీచేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి) కలిసి.. ఏ ప్రొడ్యూసర్‌కి, హీరోకి, దర్శకుడుకి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్, ఇతర మీడియా.. వాళ్ల రేటింగ్లు, టిఆర్పిల కోసం ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య హీరోల మధ్య ప్రొడ్యూసర్ల మధ్య దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అలా అబద్ధపు వార్తలు రాస్తూ ఎదుటివారి మనోభావాలను, ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లేఖను ప్రతి జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు మీడియా అసోసియేషన్ యాజమాన్యాలకు పంపడం జరుగుతుంది.