Dil Raju : తప్పు వార్తలు రాస్తే.. వెబ్ సైట్ల తాటతీస్తా.. చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు..

చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. తప్పు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా అంటూ గట్టి వార్నింగే ఇచ్చారు.

Dil Raju : తప్పు వార్తలు రాస్తే.. వెబ్ సైట్ల తాటతీస్తా.. చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు..

Dil Raju about articles on Chiranjeevi comments at Hanuman pre release event

Dil Raju : టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల రిలీజ్ వస్తే.. ఆయా చిత్రాల హీరోల పేరులు కంటే నిర్మాత దిల్ రాజు పేరు ఎక్కువుగా వినిపిస్తుంది. పలానా మూవీకి థియేటర్స్ దొరకలేదు, అందుకు కారణం దిల్ రాజే అంటూ విమర్శలు, వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ సంక్రాంతికి కూడా యధావిధిగా మళ్ళీ దిల్ రాజు పేరు సినిమా రిలీజ్‌ల వివాదాల్లో వినిపిస్తూ వస్తుంది.

ఈసారి సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ చిత్రం మాత్రమే చిన్న హీరో సినిమా కావడంతో థియేటర్స్ కేటాయింపు దగ్గర వివాదం మొదలయింది. చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వడం లేదంటూ కామెంట్స్ వినిపించాయి. ఈక్రమంలోనే దిల్ రాజు పేరు తీసుకువస్తూ, ఆయనే కారణం అన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

కాగా ఈ వివాదం గురించి మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. “గతంలో కూడా దిల్ రాజు మా సినిమాలతో పోటీగా వచ్చారు. అప్పుడు నేను దిల్ రాజుని ప్రశ్నించాను. అయితే తనది కంటెంట్ ఉన్న సినిమా అని, దానిని కూడా ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు చెప్పారు. ఆయన అన్నట్లే ఆ చిత్రం మా సినిమాలతో పాటు విజయం సాధించింది. దిల్ రాజుకి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. ఆయనకు ఏ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు. కాబట్టి థియేటర్స్ దొరకలేదని భయపడకండి. మొదటి రోజు కాకపోతే తరువాత రోజైన హనుమాన్ సినిమాని చూస్తారు” అంటూ చిరు వ్యాఖ్యానించారు.

Also read : Chiranjeevi : సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ కామెంట్స్.. దిల్ రాజు‌ని నేను ప్రశ్నించా..

అయితే ఈ వ్యాఖ్యలను కొన్ని వెబ్ సెట్స్ తప్పుగా చిత్రీకరిస్తూ వార్తలు రాస్తున్నాయి. ఇక వీటిపై దిల్ రాజు ఫైర్ అయ్యారు. “ఇండస్ట్రీలో మన పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక రకంగా నాపై విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి అలాంటి వార్తలను ఊరుకునే ప్రసక్తే లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంక్రాంతికి ఈ నాలుగు తెలుగు చిత్రాలతో పాటు తమిళ మూవీ ‘అయలాన్’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దిల్ రాజు ఆ సినిమాను వాయిదా వేయించి హనుమాన్ సినిమా విడుదల చేయాలని చెప్పారట. ఇక నైజాంలో హనుమాన్ కి థియేటర్స్ దొరకడం లేదు అన్న మాటలు పై రియాక్ట్ అవుతూ.. “హనుమాన్, గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా” అంటూ గట్టి వార్నింగే ఇచ్చారు.