Annapurna Studios : మన తెలుగు పరిశ్రమ ఒకప్పుడు చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా కూడా కొన్నాళ్ళు చెన్నైలోనే ఉంది పరిశ్రమ. ఆ తర్వాత టాలీవుడ్ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చింది. అప్పటి స్టార్ దర్శక నిర్మాతలు, హీరోలు ఇందుకు ఎంతో సహకరించారు. అయితే అందరికంటే ముందు హైదరాబాద్ కి తరలి వచ్చిన స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు.
ఏఎన్నార్ మొదట హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studios) కట్టి సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహద పడ్డారు. అన్నపూర్ణ స్టూడియోకు 1975 ఆగస్టు 13న శంకుస్థాపన చేసారు. అలా అన్నపూర్ణ స్టూడియో మొదలయి నేటికి 50 ఏళ్ళు పూర్తయింది. నేటికి అన్నపూర్ణ స్టూడి మొదలయి 50 ఏళ్ళు అవ్వడంతో ఆ సంస్థ ఈ పాత ఫొటోతో పాటు మరిన్ని స్టూడియో ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే.. వార్ 2లో ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ టాక్ ఇదే..
50 ఏళ్ళ క్రితం అన్నపూర్ణ స్టూడియోని ఏఎన్నార్ సతీమణి అన్నపూర్ణ తమ మనవడిని ఎత్తుకొని శంకుస్థాపన చేసారు. పై ఫొటోలో అన్నపూర్ణ ఎత్తుకున్న బాబు ఎవరో కాదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్. ఇప్పుడు ఎన్నో సినిమా షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఎంతోమందికి ఈ స్టూడియో ఉపాధి కల్పిస్తుంది. ఈ స్టూడియోలో దాదాపు వెయ్యి మంది నెలవారీ వేతనాలకు కూడా పనిచేస్తున్నారు. (Annapurna Studios)