Sreeleela: అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. ఎట్టకేలకు మనసులో మాట చెప్పున శ్రీలీల
తన కెరీర్ అండ్ నెక్స్ట్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela).
- V Santhosh Kumar
- Updated on- May 3, 2026 / 01:53 PM IST
Tollywood beauty Sreeleela interesting comments about her career.
- శ్రీలీల ఫోకస్ ఇప్పుడు కోలీవుడ్ వైపు.
- ధనుష్ సరసన క్రేజీ ఆఫర్.
- వైవిధ్యమైన పాత్రలే తన లక్ష్యం
Sreeleela: లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌లోకి మెరుపులా ప్రవేశించిన శ్రీలీల, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తన అద్భుతమైన డాన్సులతోనూ, నటనతోనూ కుర్రకారును మాయ చేశారు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నప్పటికీ, ఇటీవల ఆమె నటించిన కొన్ని భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో శ్రీలీల ఇప్పుడు తన రూటు మార్చుకున్నారు.
Sreemukhi: నవ యవ్వనాల నాయకి శ్రీముఖి.. నడుమందాలు చూపిస్తూ నలిపేస్తుందిగా.. ఫొటోలు
ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంతో అక్కడి ప్రేక్షకుల గుర్తింపు పొందిన ఈమె, ప్రస్తుతం స్టార్ హీరో ధనుష్ సరసన ఆయన 55వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుతో పాటు బాలీవుడ్‌లోనూ ఒక సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. డాన్సులో ఇరగదీసే శ్రీలీల, ధనుష్ వంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
తన కెరీర్ ప్రయాణం గురించి శ్రీలీల(Sreeleela) స్పందిస్తూ, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన సెంటిమెంట్ ఉన్న కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. వైవిధ్యభరితమైన కథలు మాత్రమే నటిగా తనలోని పూర్తి స్థాయి ప్రతిభను బయటకు తీస్తాయని ఆమె నమ్ముతున్నారు. అటువంటి పాత్రలే తనను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయని, అందుకే కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని శ్రీలీల పేర్కొన్నారు. దీంతో శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
