Tollywood Marriages : 2024లో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే..

2024లో వివాహం చేసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల వివరాలు..

Tollywood Marriages 2024

2024 Tollywood Marriages : ఈ సంవత్సరం 2024 లో పెళ్లిళ్లు కూడా బాగానే జరిగాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. టాలీవుడ్ లో కూడా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. 2024లో వివాహం చేసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల వివరాలు..

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ కి చెక్కేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడిపి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.

రకుల్ లాగే టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి బాలీవుడ్ చెక్కేసిన హీరోయిన్ తాప్సి కూడా మార్చ్ లో డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ ని వివాహం చేసుకుంది.

హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితిరావు హైదరి సెప్టెంబర్ లో ఇక్కడే వరంగల్ దగ్గర్లోని ఓ ఆలయంలో సింపుల్ గా వివాహం చేసుకున్నారు.

యువ హీరో కిరణ్ అబ్బవరం – హీరోయిన్ రహస్య గోరఖ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల ఆగస్టులో వివాహం చేసుకున్నారు.

సింగర్ రమ్య బెహరా – సింగర్ అనురాగ్ కులకర్ణి ఇటీవల నవంబర్ లో సింపుల్ గా వివాహం చేసుకున్నారు.

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు 47 ఏళ్ళ వయసులో నవంబర్ లో స్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడు నికోలాయ్ సచ్‌దేవ్ ను గత కొన్నేళ్లుగా ప్రేమించి ఇటీవల జులైలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట.

హీరోయిన్ మేఘ ఆకాష్ తమిళనాడులోని ఓ రాజకీయ ఫ్యామిలీకి చెందిన విష్ణు అనే వ్యక్తిని ఇటీవల సెప్టెంబర్ లో వివాహం చేసుకుంది.

హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల డిసెంబర్ 4న ఘనంగా వివాహం చేసుకున్నారు.

హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇటీవలే డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని ప్రేమ వివాహం చేసుకుంది.

కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ మురళీమోహన్ మనవరాలు రాగను ఇటీవలే కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు.

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ నటి చాందిని రావు గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవలే కొన్ని రోజుల క్రితం తిరుమలలో పెళ్లి చేసుకున్నారు.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నవంబర్ లో డాక్టర్ ప్రీతీ చల్లాను వివాహం చేసుకున్నారు.

ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్న నటుడు సాయి కిరణ్ ఇటీవలే స్రవంతిలో అనే మరో సీరియల్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నాడు.

బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్ కూడా తన ప్రియుడు, సీరియల్ నటుడు శివకుమార్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకుంది.

వీళ్ళే కాక మరికొంతమంది బుల్లితెర నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సంవత్సరం పెళ్లి పీటలు ఎక్కారు.