న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పిన తెలుగు హీరోలు

  • Publish Date - January 1, 2020 / 06:27 AM IST

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్ ను సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాదు అభిమానులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి ఎవరెవరు విషెస్ చెప్పారో మీరు చూడండి.

మహేష్ బాబు:
నాపై ఎంతగానో ప్రేమ చూపిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు ఎప్పుడు తోడుగా ఉండే నా స్నేహితులకు, నాకు సపోర్ట్‌ గా ఉంటూ ఎంతో ప్రేమ చూపిస్తున్న నా ఫ్యాన్స్‌కు నా కృతజ్ఞతలు. 2019ని నాకు ప్రత్యేకంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు మహేష్‌.

 

 

తారక్‌:
RRR షూటింగ్‌ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులందరికీ సింపుల్‌ గా శుభాకాంక్షలు తెలియజేశాడు. తెలుగు ఇంగ్లీస్ భాషల్లో అందరూ సుఖ, సంతోషాలు కలగి ఉండాలని. అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు అని తెలియజేశారు.

 

 

రామ్ గోపాల్ వర్మ:
న్యూ ఇయర్‌ వేడుకల్లోనే వర్మ తన క్రియేటీవ్ నెస్ చూపించాడు. నా డెన్‌ లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌, అమ్మాయిల కాళ్లు, దావూద్‌ ఇబ్రహిం, డోనాల్డ్‌ ట్రంప్‌ కారణంగానే జీవితం ఇంత అందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు . అంతేకాదు తరువాత తన కాస్ట్యూమర్‌ శ్రీయా బెనర్జీతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు వర్మ.

 

 

మోహన్ బాబు:
అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ 2020 ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భోగ భాగ్యములను షిర్డీ సాయి నాధుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్ చేశాడు.

 

 

ర‌వితేజ‌:
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ కొత్త సంవత్సరం సందర్భంగా ‘క్రాక్’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.