OG : పవన్ ఫ్యాన్స్‌కు షాక్.. అక్కడ ఓజీ రిలీజ్ లేనట్టే..!
పవన్ నటిస్తున్న ఓజీ (OG) మూవీ సెప్టెంబర్ 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Gossip Garage OG Not Releasing in Hindi Version
OG : పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఓజీకి ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతోంది. అయితే నార్త్‌లో మల్టీఫ్లెక్స్‌లలో ఓజీ (OG) హిందీ వెర్షన్ రిలీజ్ కావడానికి కొంచెం టైమ్ పడుతుందట. అందుకు కొన్ని మార్కెట్ కండీషన్సే కారణమట.
హిందీ మార్కెట్‌లో మల్టీప్లెక్స్‌లు.. PVR, INOX వంటివి సాధారణంగా 8 వారాల థియేట్రికల్ విండోను స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లే ముందు థియేటర్లలో 8 వారాలు రన్ కావాలి. ఓజీ OTT రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 92 కోట్లకు తీసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఓజీ హిందీ వెర్షన్‌ను మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయకుండా, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం ద్వారా ప్రొడ్యూసర్లు మల్టీప్లెక్స్‌లకు ఇచ్చే ఎక్కువ షేర్ నుంచి తప్పించుకుని, OTT రిలీజ్‌ను త్వరగా అమలు చేయడంపై దృష్టి పెడుతున్నారట.
Manchu Manoj : నాకు బతకాలని లేదు.. ఈ జీవితం చాలు అనుకున్నా.. మా అక్క నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
సౌత్ ఇండియా సినిమాల హిందీ వెర్షన్లకు తరచూ ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు, తమిళ సినిమాలు సాధారణంగా 4-6 వారాల్లో OTTకు వెళ్తుండగా, హిందీ మార్కెట్‌లో మల్టీప్లెక్స్‌లు కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే ఇవి మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే తక్కువ షేర్ తీసుకుంటాయి. OTT డీల్స్‌ను త్వరగా అమలు చేయడానికి వీలు కల్పిస్తాయి.
OG విషయంలో, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజ్ చేయడం ద్వారా హిందీ మార్కెట్‌లో కనీస రిలీజ్‌ను నిర్ధారించి, OTT రెవెన్యూపై ప్రొడ్యూసర్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో సలార్, పుష్ప-2 విషయంలోనూ ఇలాంటి వేనే ఫాలో అయ్యారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు OG హిందీ వెర్షన్ మల్టీఫ్లెక్స్‌లలో రిలీజ్ లేనట్టే అంటున్నారు.