IND vs UAE : భార‌త్ వ‌ర్సెస్‌ యూఏఈ హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌.. చివ‌రి సారి త‌ల‌ప‌డిన‌ప్పడు జ‌రిగింది ఇదే..

టీ20 ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్‌, యూఏఈ (IND vs UAE) జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సార్లు త‌ల‌ప‌డ్డాయో తెలుసా? ఎవ‌రు ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిచారంటే?

IND vs UAE : భార‌త్ వ‌ర్సెస్‌ యూఏఈ హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌.. చివ‌రి సారి త‌ల‌ప‌డిన‌ప్పడు జ‌రిగింది ఇదే..

IND vs UAE head to head record in Asia Cup T20

Updated On : September 10, 2025 / 3:11 PM IST

IND vs UAE : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను నేడు (సెప్టెంబ‌ర్ 10న‌) ఆడ‌నుంది. దుబాయ్ వేదిక‌గా ఆతిథ్య యూఏఈతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది.

కాగా.. ఆసియా క‌ప్ టీ20 చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జ‌ట్లు ఎన్ని సార్లు త‌ల‌ప‌డ్డాయో ఓ సారి చూద్దాం.

భార‌త్‌, యూఏఈ జ‌ట్లు ఆసియా క‌ప్ టీ20 చ‌రిత్ర‌లో కేవ‌లం ఒకే ఒక సారి త‌ల‌ప‌డ్డాయి. 2016 ఆసియాక‌ప్‌లో ఢాకా వేదిక‌గా ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

Ravichandran Ashwin : ఆసియాక‌ప్ 2025 పై అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ద‌క్షిణాఫ్రికానైనా చేరిస్తే బాగుండేది.. మ్యాచ్‌లు ఏమంత..

ఈ మ్యాచ్‌లో యూఏఈ తొలుత బ్యాటింగ్ చేసింది. భార‌త బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 81 ప‌రుగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. యూఏఈ బ్యాట‌ర్ల‌లో షైమాన్ అన్వర్ (43; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మిగిలిన వారిలో రోహన్ ముస్తఫా (11) మిన‌హా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, హార్దిక్ పాండ్యా, ప‌వ‌న్ నేగీ, యువ‌రాజ్ సింగ్‌లు త‌లా ఓ వికెట్ తీశారు.

దంచికొట్టిన రోహిత్ శ‌ర్మ‌..

82 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ 10.1 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ కోల్పోయి అందుకుంది. రోహిత్ శ‌ర్మ (39; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టాడు. భార‌త స్కోరు 43 ప‌రుగుల వ‌ద్ద హిట్‌మ్యాన్ తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. అందులో రోహిత్ స్కోరు 39 ప‌రుగులు కావ‌డం గ‌మ‌నార్హం.

IND vs UAE : యూఏఈతో మ్యాచ్‌.. భారీ రికార్డుపై అర్ష్‌దీప్ సింగ్ క‌న్ను..

మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. రోహిత్ ఔటైన స‌మ‌యంలో కేవ‌లం రెండు ప‌రుగులే చేయ‌గా, మ‌రో రెండు ఎక్స్‌ట్రాల రూపంలో రావ‌డం గ‌మ‌నార్హం. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన యువ‌రాజ్ (25 నాటౌట్; 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఇక ధావ‌న్ (16 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు) ప‌ర్వాలేద‌నిపించాడు. ధాటిగా ఆడిన రోహిత్ శ‌ర్మ‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

చివ‌రి ఐదు మ్యాచ్‌ల్లో..

భార‌త్‌, యూఏఈ జ‌ట్లు టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌లేదు. నేడు జ‌రిగే మ్యాచ్ రెండోది మాత్ర‌మే. ఇదిలా ఉంటే.. యూఏఈ తాను ఆడిన చివ‌రి ఐదు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. టీమ్ఇండియా తాను ఆడిన చివ‌రి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెల‌వ‌గా, ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది.