IND vs UAE : యూఏఈతో మ్యాచ్.. భారీ రికార్డుపై అర్ష్‌దీప్ సింగ్ కన్ను..
ఆసియాకప్‌లో యూఏఈ(IND vs UAE)తో మ్యాచ్‌కు ముందు అర్ష్‌దీప్ సింగ్ ఓ భారీ రికార్డు పై కన్నేశాడు.

Arshdeep Singh need one wicket to enter 100 international t20 wickets club
IND vs UAE : ఆసియాకప్ 2025లో భాగంగా టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను నేడు ఆడనుంది. ఆతిథ్య యూఏఈతో (IND vs UAE ) దుబాయ్ వేదికగా తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక అర్ష్‌దీప్ సింగ్ ఒక్క వికెట్ తీస్తే.. టీ20ల్లో టీమ్ఇండియా తరుపున 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
2022లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అర్ష్‌దీప్ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరుపున 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 8.30 ఎకానమీతో 99 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉంది. ఇక అత్యుత్తమ ప్రదర్శన 4/9 గా ఉంది. యూఏఈతో మ్యాచ్‌లోనే అతడు వంద వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. అతడి తరువాత చాహల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 114 మ్యాచ్‌ల్లో 94 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 70 మ్యాచుల్లో – 89 వికెట్లు
ఆసియాకప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
ఆసియాకప్‌లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. గ్రూప్ స్టేజీలో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో సెప్టెంబర్ 19న ఆడనుంది.