Mohan Babu : నటుడిగా మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రయాణం..

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు.

Tollywood Collection King Mohan Babu 50 year film journey as an actor

Mohan Babu : టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి సినిమాను కూడా నిర్మించారు. ఎన్నో పవర్ఫుల్ సినిమాల్లో నటించిన ఆయన తాజాగా నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. సినిమాలతో ఆయన సృష్టించిన రికార్డే సపరేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read : Sandeep Raj : నటుడిగా మారిన మరో యువ డైరెక్టర్..

1975 నుంచి 1990 వరకు మోహన్ బాబు ఇండియన్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆ పాత్రలకే సరికొత్త గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాకుండా దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. స్వర్గం నరకం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన మోహన్ బాబు అప్పటి వరకు చేసిన విలన్ పాత్రలతో నంబర్ వన్ ప్లేస్ లోకి చేరారు. ఇక ఆయన హిట్ సినిమాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే.. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలే. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు హిందీ, తమిళ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. ఆ భాషల్లో కూడా భారీ సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా పెదరాయుడు సినిమా 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా చేశారు. దీనికి రాష్ట్ర రాజకీయ కేబినెట్,ముఖ్యమంత్రి హాజరయ్యారు. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.

కేవలం సినిమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటారు మోహన్ బాబు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు మంచి చదువు అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల పాటు నటుడిగా కొనసాగుతూ..నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అన్నది అల్ టైమ్ రికార్డు. ఈ రికార్డు కేవలం మోహన్ బాబుకే సాధ్యమైంది.