Sandeep Raj : నటుడిగా మారిన మరో యువ డైరెక్టర్..
దర్శకుడు విజయ్ కనకమేడల పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా భైరవం.

Another young Colour Photo movie director Sandeep Raj turned actor
Sandeep Raj : దర్శకుడు విజయ్ కనకమేడల పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా భైరవం. ఇక ఇందులో టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన వరుస అప్డేట్స్ ఇవ్వడంతో దీనిపై మంచి బజ్ నెలకొంది. అంతేకాదు ఇందులో కీలకంగా ఉండే మరికొన్ని ఇంటెన్స్ పాత్రలను పరిచయం చేస్తున్నారు మేకర్స్.
Also Read : Bachchala malli : అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ‘అదే నేను అసలు లేను’
అందులో భాగంగానే నేడు మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ భైరవం సినిమాలో నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఆయన పులి రవీంద్ర పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ యువ డైరెక్టర్ ఇప్పటికే కలర్ ఫోటో సినిమాతో భారీ సక్సెస్ సాధించారు. కలర్ ఫోటోతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకున్నాడు. డైరెక్టర్‌గా, రైటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ ఇప్పుడు నటుడిగా కూడా మారారు.
అంతేకాకుండా ఇటీవల ఈ డైరెక్టర్ చాందినీ రావుతో నిశ్చితార్థం చేసుకున్నారు. తమ ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తున్న టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందంట. అప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ కపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.