Bachchala malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ నుంచి సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది.. ‘అదే నేను అసలు లేను’

అల్లరి నరేశ్‌ న‌టిస్తున్న మూవీ బ‌చ్చ‌ల మ‌ల్లి.

Bachchala malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ నుంచి సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది.. ‘అదే నేను అసలు లేను’

Second single Ade Nenu Asalu Lenu from Allari Naresh Bachchala malli out now

Updated On : November 22, 2024 / 12:09 PM IST

Bachchala malli : అల్లరి నరేశ్‌ న‌టిస్తున్న మూవీ బ‌చ్చ‌ల మ‌ల్లి. అమృత అయ్యర్ క‌థ‌నాయికగా న‌టిస్తున్న చిత్రానికి సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.

RC16 Update : రామ్‌చ‌ర‌ణ్ RC16 అప్‌డేట్‌.. మైసూర్‌లో నేటి నుంచే షూటింగ్ ప్రారంభం!

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌, ఓ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా రెండో పాట‌ను విడుద‌ల చేసింది. అదే నేను అసలు లేను అంటూ ఈ పాట సాగుతోంది. ఇది ఓ రొమాంటిక్ మెలోడి. ఈ పాట‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ విడుద‌ల చేశారు.

ఈ సాంగ్‌కు కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించాడు. ఎస్సీ చ‌ర‌ణ్‌, ర‌మ్య బెహ‌రా పాడారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Allu Ayaan : అల్లు అయాన్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? డ్యాన్స్ లో మాత్రం బన్నీ కాదంట.. ఎవరు మరి?