MSVG Collections: రఫ్ఫాడించిన మెగాస్టార్.. మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్(MSVG Collections) అధికారికంగా ప్రకటించిన మేకర్స్.
mana shankara varaprasad garu first day collections
- మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మొదటి రోజు భారీ కలెక్షన్స్
- రూ.84 కోట్లు కొల్లగొట్టింది అంటూ అధికారిక ప్రకటన
- రాజాసాబ్ ఎఫెక్ట్ వల్ల తగ్గిన కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మెగా మూవీ మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Priyanka- Nick: భర్త నిక్ జోనస్ తో ప్రియాంక క్యూట్ పోజులు.. ఫొటోలు
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వారి లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.84 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. అందులో, సోమవారం ఒక్కరోజే రూ.65 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక ప్రీమియర్స్ ద్వారా రూ.15 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. నిజానికి, మెగా అభిమానులు మాత్రం ఈ సినిమా ఫస్ట్ డే ఖచ్చితంగా రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుంది అని ఆశపడ్డారు.
కానీ, అది జరగలేదు. దానికి కారణం ఈ సినిమా సోమవారం విడుదల కావడం. వీకెండ్ లో రిలీజ్ అయుంటే ఈ లెక్క ఒక రేంజ్ లో ఉండేది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే, మరోపక్క ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ ఉంది థియేటర్స్ లో. కాబట్టి, ఆ దెబ్బ కూడా పడింది అని చెప్పాలి. అయినప్పటికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటిరోజు రికార్డ్ లెవల్లో వసూళ్లు సాధించింది అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ లెక్క మరింతంగా పెరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే హైయ్యెస్ట్ నంబర్స్ కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది అని.

mana shankara vara prasad garu first day collection
