×
Ad

Prabhas Birthday Special: వెండితెర బాహుబలి.. “ప్రభాస్” బర్త్ డే స్పెషల్

ప్రభాస్.. ఇది పేరు కాదు.. బ్రాండ్. ఈ ఒక్క పేరు చెప్తే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయి.. వందల కోట్ల కలెక్షన్స్(Prabhas Birthday Special) తో బాక్సాఫీస్లు షేక్ అవుతాయి. ఆరడుగుల కటౌట్.. హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. అందమైన చిరునవ్వు.. కల్మషం లేని మనస్తత్వం.. ఎంత ఎదిగినా ఒదిగిపోయే గుణం.. ఇవన్నీ ఒక చోట చేరితే ప్రభాస్.

tollywood Darling Prabhas Birthday special story

Prabhas Birthday Special: ప్రభాస్.. ఇది పేరు కాదు.. బ్రాండ్. ఈ ఒక్క పేరు చెప్తే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయి.. వందల కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్లు షేక్ అవుతాయి. ఆరడుగుల కటౌట్.. హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. అందమైన చిరునవ్వు.. కల్మషం లేని మనస్తత్వం.. ఎంత ఎదిగినా ఒదిగిపోయే గుణం.. ఇవన్నీ ఒక చోట చేరితే ప్రభాస్. అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. ఎవరైనా సినిమాలు చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ, సినిమా(Prabhas Birthday Special) ఇండస్ట్రీకే పేరు తెచ్చిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాకి ముందు.. బాహుబలి తరువాత అనే రేంజ్ లో తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన హీరో ప్రభాస్. ఇప్పుడు అందరు వాడేస్తున్న పాన్ ఇండియా అనే పదాన్ని క్రియేట్ చేసిందే ఆయన. అందుకే ఆయన కింగ్ ఆఫ్ బాక్సాఫీస్. అలాంటి ప్రభాస్ నేడు 46వ పుట్టున రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి స్పెషల్ ఆర్టికల్ మీకోసం.

ఈశ్వర్ తో సినీ ప్రయాణం.. వర్షం హిట్ తో మలుపు..

2002లో విడుదలైన ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆరంబం అంత గొప్పగా లభించలేదు. హైట్ ఎక్కువగా ఉన్నాడని, అదే ఆయనకీ మైనస్ అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ తరువాత రాఘవేంద్ర సినిమాతో కూడా అదే రిజల్ట్. దీంతో అసలు సినిమాలు చేయాలా.. లేదా వదిలేసి వెళ్ళాలా అనే ఆలోచనలో పడిన సందర్భం. ఆలాంటి సమయంలో వచ్చిన సినిమానే వర్షం. నిర్మాత ఎంఎస్ రాజు కథ, శోభన్ దర్శకత్వం, ప్రభాస్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. ఆప్పటివరకు ఆయన హైట్ గురించి మాట్లాడినవారు.. అసలు హీరో అంటే ఇలాగే ఉండాలి కదా అని రేంజ్ లో ప్రభాస్ మెప్పించాడు. ఈ ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది.

Chandru: నా సినిమా చూసి ‘ఓజీ’ చేశారు.. సీన్స్ అలానే ఉన్నాయి.. కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

చరిత్ర తిరగరాసిన ‘చత్రపతి’..

ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే చత్రపతి అనే చెప్పాలి. మాస్ లో ఆయన ఫాలోయింగ్ పెంచిన సినిమా. వర్షం హిట్ అయ్యింది కానీ, ముందు ముందు ఎలాంటి సినిమాలు చేయాలి అని డైలమా. ఆ సమయంలో.. ఈ బాడీకి మాస్ అయితేనే పర్ఫెక్ట్ అంటూ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ప్రభాస్. “ఒక్క అడుగు.. ఒక్క అడుగు” అనే డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఒక్క అడుగుతో ఇండస్ట్రీ మొత్తాని షేక్ చేశాడు ప్రభాస్.

మాస్ మాత్రమే కాదు.. క్లాస్ తో కూడా కుమ్మేశాడు..
వర్షం, చత్రపతి లాంటి సూపర్ హిట్స్ తరువాత ప్రభాస్ కేవలం కమర్షియల్ సినిమాలకే సెట్ అవుతాడు. అతనిలో వేరియేషన్స్ లేవు. అలా అయితే కష్టం అన్నారు చాలా మంది. అలా అన్నవారందరికీ “డార్లింగ్” సినిమాతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ప్రభాస్. ఆ తరువాత “మిస్టర్ పర్ఫెక్ట్”, “మిర్చి” లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి తనలోని వర్సటాలిటీని ఆడియన్స్ కి రుచి చూపించాడు. కేవలం మాస్ మాత్రమే కాదు.. క్లాస్ సినిమాలతో కూడా కుమ్మేస్తానని నిరూపించుకున్నాడు.

బాహుబలితో గ్లోబల్ స్టార్ రేంజ్ కి..
బాహుబలి, బాహుబలి 2.. ఈ రెండు సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాడు ప్రభాస్. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామా ఇండియన్ సినీ రూపురేఖలనే మార్చేసింది. ఒక హీరో ఒక సినిమా కోసం ఒక ఆరు నెలలు, లేదా ఒక ఏడాది కాలం పని చేయవచ్చు. కానీ, ప్రభాస్ మాత్రం ఈ సినిమా కోసం ఏకంగా ఐదు సంవత్సరాల కాలాన్ని వెచ్చించాడు అంటే దర్శకుడిపై తనకున్న నమ్మకం. ఆ నమ్మకమే అతనికి ఈ స్థాయిని కలిగించింది. ఈ సినిమా కోసం అతను తీసుకున్న శ్రమ, డెడికేషన్‌కు నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు.

పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్..
బాహుబలి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలయ్యాయి. సౌత్ ఇండియన్ హీరో నుండి, నేషనల్ సెలెబ్రిటిగా మారిపోయాడు. కానీ, ఈ మూడు సినిమాలు మళ్ళీ ప్రభాస్ కెరీర్ కి కాస్త బ్రేక్ వేశాయి. అయన స్థాయి సినిమాలు కాకపోవడంతో ఫ్లాప్స్ గా నిలిచాయి.

సలార్, కల్కి సినిమాలతో జూలు విదిల్చిన సింహంలా..
వరుసగా మూడు ఫ్లాప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అయ్యారు. కానీ, ఆయనకు తెలుసు కదా తన ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమాలు కావాలని. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసాడు ప్రభాస్. ఆయన బాడీకి పర్ఫెక్ట్ ఎలివేషన్ పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా క్లియర్ గా చూపించింది. దాంతో, జూలు విదిల్చిన సింహంలా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ స్టామినాని మరోసారి రుచి చూపించింది. ఇక ఆ తరువాత వచ్చిన కల్కి సినిమా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

రాజసాబ్ తో వింటేజ్ డార్లింగ్ లుక్ లో..
ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా “రాజా సాబ్”. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా కాలం తరువాత వింటేజ్ డార్లింగ్ లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు నేటిజన్స్.

స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజీ సినిమాలపై భారీ అంచనాలు..
రాజసాబ్ తరువాత ప్రభాస్ నుంచి మరో నాలుగు భారీ సినిమాలు రానున్నాయి. వాటిలో మొదటిది ఫౌజీ. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లైనప్ ఉన్న ఏకైక హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి. కేవలం ఈ 6 సినిమాలతోనే ఇండియా లెవల్లో 10 వెల కోట్ల బిజినెస్ జరుగనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా ప్రభాస్ ని బాక్సాఫీస్ బాద్షా అనేది.

గొప్ప వ్యక్తిత్వం..
వెండితెరపై ప్రభాస్ ఎంత పవర్ఫుల్‌గా కనిపిస్తాడో రియల్ లైఫ్‌లో అంత మృదుస్వభావి. తక్కువగా మాట్లాడే, స్నేహపూర్వకమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు ప్రభాస్. ఎదుటివారికి భోజనం పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలు చెప్పడం మనం చూసే ఉంటాం. అలా వ్యక్తిత్వంలో కూడా గొప్ప వ్యక్తి ప్రభాస్. అలాంటి ప్రభాస్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. 10టీవీ నుంచి మన డార్లింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..