Chandru: నా సినిమా చూసి ‘ఓజీ’ చేశారు.. సీన్స్ అలానే ఉన్నాయి.. కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ. టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్(Chandru) సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలై భారీ విజయాన్ని సాదించింది.

Chandru: నా సినిమా చూసి ‘ఓజీ’ చేశారు.. సీన్స్ అలానే ఉన్నాయి.. కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

Kabzaa movie director Chandru's sensational comments on OG movie

Updated On : October 22, 2025 / 5:52 PM IST

Chandru: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ. టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలై భారీ విజయాన్ని సాదించింది. చాలా కాలం తరువాత పవన్ నుంచి వచ్చిన స్ట్రెయిట్ సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ(Chandru) చేసుకున్నారు. దీంతో, థియేటర్స్ అన్నీ ఓజీ.. ఓజీ నినాదాలతో మారుమ్రోగిపోయాయి. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. మొదటిరోజే ఏకంగా రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం ౧౦ రోజుల్లోనే రూ.౩౦౦ కోట్లకు పైగా వసూళ్లు సాదించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఓజీ.

Ilaiyaraaja: డ్యూడ్ మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా.. సినిమాపై చట్టపరమైన చర్యలు

ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.332 కోట్లు సాధించి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఓజీ సినిమా అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓజీ సినిమాపై కన్నడ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన సినిమాను చూసి ఓజీ తెరకెక్కించారు అంటూ కామెంట్స్ చేశాడు. ఆయన మరెవరో కాదు కన్నడ దర్శకుడు చంద్రు. ఈ దర్శకుడు తెరకెక్కించిన ఆ సినిమా కబ్జా. ఉప్పెంద్ర, సుదీప్ ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టార్ కథాంశంతో తెరకెక్కింది. 2023లో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దాంతో డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

అయితే, ఈ దర్శకుడు తాజాగా ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఓజీ సినిమా చూస్తున్నంత సేపు నాకు నా కబ్జా సినిమా గుర్తుకువచ్చింది. చాలా సన్నివేశాలు అలానే ఉన్నాయి. కబ్జా సినిమా చూశాక దర్శకుడు ఓజీ సినిమా చేసి ఉంటాడు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో, దర్శకుడు చంద్రు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే దర్శకుడు చంద్రు పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్. అసలు కబ్జా సినిమాకు ఓజీ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే కేజీఏఫ్ సినిమా చూసి కబ్జా సినిమా చేశారు ముందు దాని గురించి మాట్లాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కి దర్శకుడు చంద్రు ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చూడాలి.