Ilaiyaraaja: డ్యూడ్ మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా.. సినిమాపై చట్టపరమైన చర్యలు

తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. (Ilaiyaraaja)కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాదించింది.

Ilaiyaraaja: డ్యూడ్ మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా.. సినిమాపై చట్టపరమైన చర్యలు

Music director Ilayaraja ready to take legal action against Dude movie

Updated On : October 22, 2025 / 5:20 PM IST

Ilaiyaraaja: తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాదించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన (Ilaiyaraaja)ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Mass Jathara : మాస్ జాత‌ర నుంచి ‘సూప‌ర్ డూప‌ర్’ సాంగ్ వ‌చ్చేసింది.. అద‌రిపోయిన ర‌వితేజ‌, శ్రీలీల స్టెప్పులు..

ఇదిలా ఉంటే, డ్యూడ్ సినిమా మేకర్స్ కి సంగీత దిగ్గజం ఇళయరాజా షాకిచ్చారు. ఆయన అనుమతి లేకుండా సినిమాలో రెండు పాటలను వాడారు అంటూ ఆయన కోర్టుకెక్కారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతివ్వల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ఇళయరాజా విన్నపాన్ని అంగీకరించిన కోర్టు చట్టపరమైన చర్యలకు అనుమతిని ఇచ్చింది. మరి ఈ విషయంపై ఇళయరాజా చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా తాను చేసిన పాటలను అనుమతి లేకుండా వాడారంటూ కోర్టుకెక్కాడు ఇళయరాజా.