మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ టాలీవుడ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు మార్చి 8న ఆతహత్మ చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మిర్యాలగూడలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు సాయి రాజేష్.. మారుతీ రావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ వ్యంగ్యంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘18 ఏళ్ళు నిన్ను గారాబంగా పెంచాను.. పెన్సిలు, రబ్బరు, బొట్టుబిళ్ళ, పప్పరమిట్టు (పిప్పరమెంట్)..ఏ ది అడిగితే అది…. ఇదంతా ఎందుకోసం ?? నేను ఏ మలపత్రాష్టుడిని తెచ్చినా…. తలదించుకొని తాళి కట్టించికొని ఆదర్శ నారిగా నిలుస్తావని… ఏమన్నా అంటే…నీ భర్త ని చంపించావు అంటావే ? 20 లక్షలు ఒక కిరాయి హాంతకుడికి ఇచ్చినప్పుడు… అందులో ప్రతి నోటు…నాన్న ప్రేమతో తపించిపోయాయి…. అల్లుడిని చంపానే కానీ…నిన్ను కాదుగా…అక్కడైన నీకు నా ప్రేమ అర్థం కాలేదా ???
గర్భవతిగా ఉన్న కూతురు కోసం ఒక మర్డర్ చేయిస్తే… అది తండ్రి ప్రేమ…చనిపోయిన కుర్రాడి తండ్రిది మాత్రం కుట్ర అనుకునే గొర్రెగాళ్ళు నా అభిమానులు… వాళ్ళకే నా ప్రేమ అర్థం అయింది… నీకెందుకు కాలేదు… పర్లేదు… నన్ను అభిమానిస్తున్న ప్రతి ఇంట్లో కూతురికి నేను తండ్రిగా వస్తా…. ప్రతి కొడుక్కి మామగా వస్తా’’.. అంటూ పోస్ట్ చేశాడు. అలాగే ఓ వ్యక్తి.. ‘నీకో కూతురు ఉంది…15 ఏళ్లకే ప్రేమించి వెళ్ళిపోతే తెలుస్తుంది ఆ తండ్రి బాధ.. తండ్రిలా ఆలోచించు’.. అని రిప్లై ఇవ్వగా.. ‘నీకో పెళ్ళాం ఉంది…ఆమె నిండు గర్భంతో వున్నప్పుడు నిన్ను ఆమె ముందే నరికేస్తే అప్పుడు తెలుస్తుంది ఆమె బాధ.. మనిషిలా ఆలోచించు’.. అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు సాయి రాజేష్.. ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.