Godzilla x Kong : సోషల్ మీడియాలో కింగ్ కాంగ్ వెర్సస్ గాడ్జిల్లా ట్రెండ్.. కాంగ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా టాలీవుడ్ దర్శకుడు..

కింగ్ కాంగ్ వెర్సస్ గాడ్జిల్లా ట్రెండ్ లోకి టాలీవుడ్ దర్శకుడు కూడా ఎంట్రీ ఇచ్చారు. గాడ్జిల్లా వంటి చిన్న నటులతో నటించి మా కాంగ్ అన్న..

Tollywood Director sai rajesh viral post on Godzilla x Kong The New Empire

Godzilla x Kong : మర్వెల్ అండ్ డిసి సినిమాటిక్ యూనివర్స్ లు తరువాత ఆడియన్స్ ని ఆకట్టుకున్న మరో హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ ‘కింగ్ కాంగ్ వెర్సస్ గాడ్జిల్లా’. కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి హిట్ అయ్యాయో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన పలు సినిమా సిరీస్ లు ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాయి.

అయితే 2021లో ఈ రెండు పాత్రలను ఒకటి చేస్తూ ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని.. ఓ కొత్త సినిమాటిక్ యూనివర్స్ కి బీజం అయ్యింది. కేవలం యూనివర్స్ కి మాత్రమే కాదు, ఫ్యాన్ వార్స్ కి కూడా బీజం అయ్యింది. గాడ్జిల్లా అండ్ కాంగ్ అభిమానులు.. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ స్టార్ట్ చేసారు.

Also read : Vijay Deverakonda : VD12 మూవీలో ఎక్కువ తమిళ్ స్టార్‌డమ్ కనిపిస్తుందట.. సినిమా స్టోరీ అంతా..

తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ : ది న్యూ ఎంపైర్’ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా రావడంతో గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ ఫ్యాన్ వార్ మళ్ళీ టైం లైన్ లోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్ గట్టిగా జరుగుతుంది. ఒక ఫ్యాన్ బేస్ ని మించిన కామెంట్స్, ఎడిట్స్ ని మరో ఫ్యాన్ బేస్ చేస్తూ నెట్టింట గోల చేస్తున్నారు.

ఇక ఈ ట్రెండ్ లోకి టాలీవుడ్ దర్శకుడు ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ కూడా ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ కాంగ్ ఫ్యాన్స్ కన్వీనర్ అంటూ అభిమానంతో ఓ పోస్ట్ వేశారు. “మూడేళ్ళ నిరీక్షణ తరువాత మా కాంగ్ అన్న దర్శనం జరిగింది. తనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో కలిసి నటించవద్దు అని మేమంతా చెప్పినా వినకుండా మల్టీస్టారర్ చేస్తూ చిన్న నటులను (గాడ్జిల్లా) ప్రోత్సహిస్తున్నాడు” అంటూ పోస్ట్ వేశారు. ఇక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు