Vijay Deverakonda : VD12 మూవీలో ఎక్కువ తమిళ్ స్టార్‌డమ్ కనిపిస్తుందట.. సినిమా స్టోరీ అంతా..
VD12 మూవీలో ఎక్కువ తమిళ్ స్టార్‌డమ్ కనిపిస్తుందని విజయ్ చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీ అంతా తమిళనాడు, శ్రీలంక..

Vijay Deverakonda interesting comments about VD12 movie story
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈక్రమంలోనే రీసెంట్ గా విజయ్ తమిళంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో విజయ్ తన నెక్స్ట్ మూవీ VD12 గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ తన 12వ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
Also read : Vijay Deverakonda : కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్న విజయ్ దేవరకొండ.. ఎందుకు..!
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమా చెన్నై, శ్రీలంక, వైజాగ్ నేపథ్యంతో సాగుతుంది. తమిళనాడు అనేది మెయిన్ పాయింట్ గా సాగుతుంది. అందుకనే ఈ సినిమాలో ఎక్కువుగా తమిళ నటులు కనిపిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
.@TheDeverakonda about #VD12 ?#Familystar #VijayDeverakonda pic.twitter.com/gPUj08rmfI
— GSK Media (@GskMedia_PR) March 30, 2024
ఇక ఈ కామెంట్స్ చూస్తుంటే.. ఈ సినిమా కథ శ్రీలంకలోని తమిళియన్స్ కి సంబంధించిన కథేమో అనిపిస్తుంది. భారతదేశ మరియు శ్రీలంక చరిత్రలో ఈ తమిళియన్ కథకి ఒక పెద్ద పేజీనే ఉంది. ఆ సమయంలో జరిగిన అంతర్గత యుద్దాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలను ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారా అనిపిస్తుంది.
కాగా గతంలో మణిరత్నం ‘అమృత’ సినిమాలో ఆ యుద్ధాలను కొంతవరకు చూపించారు. ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో కూడా ఈ విషయం గురించి చూపించారు. ఇప్పుడు VD12 కూడా అదే పాయింట్ తో రాబోతోందా అనిపిస్తుంది.