Vijay Deverakonda : కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్న విజయ్ దేవరకొండ.. ఎందుకు..!

విజయ్ దేవరకొండ సక్సెస్ లో కొత్త దర్శకులు పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. అలాంటిది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్న విజయ్. ఎందుకు..!

Vijay Deverakonda : కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్న విజయ్ దేవరకొండ.. ఎందుకు..!

Vijay Deverakonda said he didnt gave chances to debutante director

Updated On : March 31, 2024 / 3:01 PM IST

Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ లు చేస్తూ వచ్చిన విజయ్.. నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ కి ఇది మొదటి మూవీనే.

ఆ తరువాత విజయ్ నటించిన ద్వారక, అర్జున్ రెడ్డి సినిమాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కించినవే. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే విజయ్ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయారు. ఈ సినిమాలు మాత్రమే కాదు టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కించినవే. ఈ రెండు చిత్రాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Also read : Mahesh Babu Family : మహేష్ బాబు ఫ్యామిలీ స్విట్జర్లాండ్ వెకేషన్ ఫోటోలు చూశారా?

విజయ్ సక్సెస్ లో కొత్త దర్శకులు పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. అలాంటిది విజయ్ ఇప్పుడు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్నారు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చారు. “మొదటి సినిమా డైరెక్ట్ చేసే వ్యక్తికి అన్ని క్రాఫ్ట్స్ పై అవగాహన ఉండదు. కొన్నిసార్లు అది సినిమా లాస్ కి దారి తీస్తుంది. అప్పుడు నిర్మాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కొత్తవారితో ప్రయోగాలు చేసి నిర్మాతలకు ఇబ్బంది కలిగించకూడదని” అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

“ఎవరైనా కొత్త దర్శకుడు కేవలం ఒక సినిమా తీసిన అవగాహన ఉంటే, ఆ సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా నాకు సంబంధం లేదు. కానీ ఆ సినిమాలోని ఎడిటింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఏది నన్ను ఆకట్టుకున్నా.. ఆ డైరెక్టర్ కి రెండో అవకాశం నేను ఇస్తాను” అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ కామెంట్స్ పై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.