తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రాశీకన్నా ఇప్పుడు దక్షిణాదిలో అన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడా భారీ సినిమాల్లో నటిస్తుంది. అయితే ఇప్పటివరకు తన వ్యక్తిగత విషయాలను గురించి వెల్లడించింది. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వివరించింది ఈ బ్యూటీ.
గ్లామరస్ పాత్రలు చేయాలని చాలా మంది దర్శకులు ఒత్తిడి చేసినా చెయ్యనని, క్యారెక్టర్‌కి ప్రధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటించేందుకు ఇంట్రస్ట్ ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ భామ. గ్లామరస్ క్యారెక్టర్లు చేసే విషయంలో కొన్ని బౌండరీస్ ఉన్నాయని చెప్పింది. అలాగే, తన లవ్ ఎఫైర్ల గురించి కూడా బయటకు చెప్పింది రాశీ కన్నా.
‘నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా డేటింగ్ పైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. కానీ, నేను నా పదహారేళ్లు వయస్సులోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. అతడు నా క్లాస్‌మేట్. మా ఇద్దరి వయసు ఒకటే. తర్వాత ఇద్దరం దూరమయ్యాం’ అని ఆమె వెల్లడించింది.
ఇక రాశీ కన్నా గురించి ఇటీవలి కాలంలో పలు రూమర్లు వచ్చాయి. క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి కారణం రాశీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ యంగ్ బౌలర్ ఫాలో అవడమే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయిపోయింది. దీనిపై రాశీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ‘బూమ్రా, నేను స్నేహితులం మాత్రమే’ అని ఓ కామెంట్ చేసింది ఈ భామ.