Tollywood hero Akkineni Nagarjuna sister Naga Saroja Passed away
Naga Saroja : అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగేశ్వరరావుకి నాగార్జునతో పాటు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. సత్యవతి, నాగ సరోజ, నాగ సుశీల, వెంకట్, నాగార్జున.. అక్కినేని వారసులు. అయితే వీరిలో నాగార్జున, నాగ సుశీల పేరులు మాత్రమే సినీ పరిశ్రమలో ఎక్కువ వినిపిస్తుంటాయి. హీరో సుశాంత్ తల్లిగా, నిర్మతగా నాగ సుశీల అందరికి సుపరిచితురాలు. ఇక మిగిలిన వారు పరిశ్రమలో పెద్దగా కనిపించారు. అయితే వీరిలో సత్యవతి చాలా సంవత్సరాలు క్రితమే మరణించారు.
Also read : Ram Charan : ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్ జంట.. వరుణ్ తేజ్ పెళ్లి పనులు కోసమేనా..?
ఇక ఈ మంగళవారం మరో అక్కినేని వారసురాలు నాగ సరోజ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈమె సినిమా పరిశ్రమకు పూర్తి దూరంగా ఉండడంతో ఈమె మరణించిన సంగతి కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా నాగ సరోజ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. ఏదో పని మీద ముంబై వెళ్లిన నాగ సరోజ.. అక్కడే మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అక్కినేని కుటుంబం స్పందించలేదు.