Dhurandhar: ‘దురంధర్’ సినిమాను ఆ దేశాలు బ్యాన్ చేశాయి.. కారణం ఏంటో తెలుసా.?

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్(Dhurandhar). స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు.

Dhurandhar: ‘దురంధర్’ సినిమాను ఆ దేశాలు బ్యాన్ చేశాయి.. కారణం ఏంటో తెలుసా.?

Arab countries banned ranveer singh Dhurandhar movie

Updated On : December 12, 2025 / 8:46 PM IST

Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. URI లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆదిత్య ధర్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది. కేవలం ఏడూ రోజ్జుల్లోనే ఈ సినిమా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో, ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి, రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Akhanda 2: అఖండ 2పై నెగిటివ్ రివ్యూలు.. నిజమే అంటున్న నిర్మాతలు.. కారణం ఏంటంటే?

ఇదిలా ఉంటే, ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన దురంధర్(Dhurandhar) సినిమాను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. దానికి కారణం ఈ సినిమాలో పాకిస్థాన్ కి వ్యక్తిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉండటమే. ఈ సినిమాను బ్యాన్ చేసిన దేశాల్లో ఓమన్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ, ఖతార్ దేశాలు ఉన్నాయి. నిజానికి ఈ దేశాలు బాలీవుడ్ సినిమాలు చాలా పెద్ద మార్కెట్ అనే చెప్పాలి. బాలీవుడ్ సినిమాలకు అక్కడ మంచి ఆదరణ ఉంది. అందుకే, ప్రతీ హిందీ సినిమాను ఈ దేశాల్లో తప్పకుండా విడుదల చేస్తారు. కానీ, కేవలం పాకిస్థాన్ కి వ్యతిరేకమైన సన్నివేశాలు ఉన్న కారణంగా ఆయా దేశాలు దురంధర్ సినిమాను బ్యాన్ చేశాయి. దీంతో, అక్కడి బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు డిజప్పాయింట్ అవుతున్నాయి.