Akhanda 2: అఖండ 2పై నెగిటివ్ రివ్యూలు.. నిజమే అంటున్న నిర్మాతలు.. కారణం ఏంటంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2(Akhanda 2). మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. అది పినిశెట్టి విలన్ గా నటించాడు.
Producers respond to negative reviews of Akhanda 2
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. అది పినిశెట్టి విలన్ గా నటించాడు. పలు వాయిదాల మధ్య అఖండ 2 సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా చూసి ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో, అఖండ 2(Akhanda 2) సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Priyanka Chopra: ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలు
అయితే, అఖండ 2 సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చినప్పటికీ కొంతమంది మాత్రం నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయం గురించి తాజాగా నిర్మాతలు కూడా స్పందించారు. “ప్రేక్షకుల నుంచి అఖండ 2 సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గంటకు 25వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. కేవలం తెలుగులోనే కాదు హిందీ బెల్ట్‌లో కూడా మంచి టాక్ వచ్చింది. అయితే, తెలుగులో కొన్ని నెగిటీవ్ రివ్యూలు రావడం నిజమే. మేము కూడా అది గమనించాము. రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారిది. కానీ, రియాలిటీ వేరేగా ఉంది. రివ్యూలతో సంబంధం లేకుండా మా అఖండ 2 సినిమా దూసుకుపోతుంది” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అఖండ 2 సినిమాపై వస్తున్న నెగిటీవ్ పైన నిర్మాతలు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
