Mana Shankara Vara Prasad Garu : మెగా, వెంకీ స్టెప్పులతో పూనకాలే.!
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Gossip Garage Chiranjeevi Venkatesh Stylish Dance in Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 2026 సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిరు.. అనిల్ మార్క్ కామెడి, తన స్టైల్ డ్యాన్స్ స్టెప్పులతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ మూవీలో ఓ సాంగ్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతోందట. చిరంజీవి, వెంకీ ఇద్దరూ ఫుల్ ఫైర్‌తో అదరగొట్టబోతున్నారని టాక్. ఆ ఇద్దరికి కామన్‌గా సెట్ అయ్యే ఒక హుక్ స్టెప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ హుక్ స్టెప్ ‘నాటు నాటు’లా సింపుల్‌గా.. ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉంటుందని అంటున్నారు.
Dhurandhar: ‘దురంధర్’ సినిమాను ఆ దేశాలు బ్యాన్ చేశాయి.. కారణం ఏంటో తెలుసా.?
చిరు, వెంకీ స్టెప్పులేసే సాంగ్ అయ్యాక ఫ్యాన్స్ అంతా రీల్స్, షార్ట్స్‌తో సోషల్ మీడియా సెన్సేషనల్‌గా మారుస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట మేకర్స్. ఇటీవల విడుదలైన BTS పిక్చర్‌లో చిరు, వెంకీ ఇద్దరూ సెట్స్‌పై ఎనర్జిటిక్‌గా కనిపించడంతో ఈ బజ్ మరింత పెరిగింది. స్క్రీన్‌పై మెగాస్టార్‌తో విక్టరీ కలిసి చేసే ఈ మెగా-విక్టరీ హంగామా ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా, సినీ లవర్స్ అంతా సంక్రాంతికి సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.
నయనతార కూడా ఈ సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుందట. చిరు గ్రేస్ ఫుల్ స్టెప్స్‌తో వెంకటేశ్ స్వాగ్ మిక్స్ అయితే పాన్-ఇండియా లెవెల్‌లో వైరల్ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై రోజుకో గాసిప్ హైప్‌ను ఇంకా పెంచుతోంది.
