Akhanda 2 Collections : ‘అఖండ 2’ ఫ‌స్ట్‌ డే క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య తాండ‌వం..

బాల‌కృష్ణ‌ న‌టించిన మూవీ అఖండ 2- తాండ‌వం చిత్రం తొలి రోజు భారీ వ‌సూళ్ల‌ను (Akhanda 2 Collections) సాధించింది.

Akhanda 2 Collections : ‘అఖండ 2’ ఫ‌స్ట్‌ డే క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య తాండ‌వం..

nandamuri-balakrishna-akhanda-2-day-1-box-office-collections

Updated On : December 13, 2025 / 12:18 PM IST

Akhanda 2 Collections : నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌ న‌టించిన మూవీ అఖండ 2- తాండ‌వం. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో సంయుక్త క‌థానాయిక. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా లు కీల‌క పాత్ర‌లను పోషించ‌గా.. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల‌య్య రెండో కూతురు తేజ‌స్విని ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించారు.

అఖండ చిత్రానికి సీక్వెల్ కావ‌డంతో భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం డిసెంబ‌ర్ 12 (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ తెచ్చుకుంది. ఇక బాలయ్య నట విశ్వరూపం, శివతాండవాన్ని తలపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్‌కు పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రం 59.5 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను (Akhanda 2 Collections)సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఇక ఈ రోజు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Mana Shankara Vara Prasad Garu : మెగా, వెంకీ స్టెప్పులతో పూనకాలే.!

ఈ నేప‌థ్యంలో ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఈ చిత్ర వ‌సూళ్లు 100 కోట్ల‌ను దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.